Bandla Ganesh: ఆ మాట ఇస్తున్నా.. గబ్బర్ సింగ్‍కు థియేటర్లు ఇవ్వండి: బండ్ల గణేశ్-pawan kalyan fans do not damage theatres bandla ganesh says at gabbar singh re release meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bandla Ganesh: ఆ మాట ఇస్తున్నా.. గబ్బర్ సింగ్‍కు థియేటర్లు ఇవ్వండి: బండ్ల గణేశ్

Bandla Ganesh: ఆ మాట ఇస్తున్నా.. గబ్బర్ సింగ్‍కు థియేటర్లు ఇవ్వండి: బండ్ల గణేశ్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 31, 2024 04:28 PM IST

Bandla Ganesh - Gabbar Singh Re-Release: గబ్బర్ సింగ్ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన రీ-రిలీజ్ కానుంది. ఇందుకోసం మూవీ టీమ్ నేడు ప్రెస్‍మీట్ నిర్వహించింది. ఈ మూవీకి థియేటర్లు ఇవ్వాలని ఎగ్జిబిటర్లను నిర్మాత బండ్ల గణేశ్ కోరారు.

Bandla Ganesh: ఆ మాట ఇస్తున్నా.. గబ్బర్ సింగ్‍కు థియేటర్లు ఇవ్వండి: బండ్ల గణేశ్
Bandla Ganesh: ఆ మాట ఇస్తున్నా.. గబ్బర్ సింగ్‍కు థియేటర్లు ఇవ్వండి: బండ్ల గణేశ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా 12 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన గబ్బర్ సింగ్ చిత్రం రీ-రిలీజ్ అవుతోంది. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా.. చాలా చోట్ల ఇప్పటికే హౌస్ ఫుల్స్ అయ్యాయి. అయితే, డిమాండ్ ఉన్నా అభిమానుల హంగామాకు భయపడి కొన్ని చోట్ల గబ్బర్ సింగ్ మూవీకి థియేటర్లు ఇచ్చేందుకు యజమానులు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఈ విషయంపైనే నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు.

గబ్బర్ సింగ్ సినిమా రీ-రిలీజ్ కోసం నేడు (ఆగస్టు 31) ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. నిర్మాత బండ్ల గణేశ్, దర్శకుడు హరీశ్ శంకర్ సహా మరికొందరు ఈ మీట్‍లో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‍కు భక్తుడినంటూ మరోసారి సుదీర్ఘంగా స్పీచ్ అదరగొట్టారు బండ్ల గణేశ్. థియేటర్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేశారు.

థియేటర్లను ఆగం చేయరు

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన నేతగా ఉన్నారని, అందుకే ఆయన అభిమానులు కూడా బాధ్యతగా నడుచుకోవాలని బండ్ల గణేశ్ సూచించారు. చాలా మంది గబ్బర్ సింగ్ చిత్రానికి థియేటర్లను ఇవ్వడం లేదని, ఫ్యాన్స్ సీట్లు విరగ్గొడతారని చెబుతున్నారని బండ్ల అన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ క్రమశిక్షణగా ఉంటారని ఆయన చెప్పారు.

అభిమానులు థియేటర్లకు ఎలాంటి నష్టం చేయరని, పవన్ కల్యాణ్ అభిమానిగా, భక్తుడిగా మాట ఇస్తున్నానని బండ్ల గణేశ్ అన్నారు. “ఎగ్జిబిట్లందరికీ చెబున్నా దయచేసి థియేటర్లు ఇవ్వండి. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ అభిమానులు ఉదయం గుడికి వెళతారు. ఆ తర్వాత థియేటర్‌కు వెళతారు. గుడికి వెళ్లి పవన్ వందేళ్లు బతకాలని కోరుకుంటారు. థియేటర్‌కు వెళ్లి ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిలో మమ్మల్ని నిరుత్సాహపరచవద్దు” అని బండ్ల గణేశ్ చెప్పారు.

“పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఆయన అభిమానిగా, భక్తుడిగా మాట ఇస్తున్నా. మా వాళ్లు థియేటర్లు ఇరగ్గొట్టరు. ఆగం చేయరు. పవన్ కల్యాణ్ మనుషుం మేం. మా బాస్ ఇప్పుడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు. గబ్బర్ సింగ్ సినిమా చూస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు. కాబట్టి మీరు ఆటంకం కలిగించవద్దు” అని బండ్ల గణేశ్ అన్నారు.

పవన్ అభిమానులకు గబ్బర్ సింగ్ అలా..

హిందువులకు భగవద్గీత ఎలాగో.. పవన్ కల్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ అలా అని బండ్ల గణేశ్ చెప్పారు. “హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబల్ ఎంత పవిత్రమైనదో.. పవన్ కల్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ అంతే పవిత్రమైనది. చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది” అని బండ్ల అన్నారు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం 2012 మే 11వ తేదీన రిలీజైంది. భారీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ చిత్రంలో పవన్ యాక్షన్, డైలాగ్స్, స్వాగ్, మేనరిజమ్స్ అభిమానులను ఊపేశాయి. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

పవన్ కల్యాణ్ లైనప్‍‍లో ప్రస్తుతం ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఈ చిత్రాల నుంచి అప్‍డేట్స్ రానున్నాయి.