Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ట్రెండ్ ను ఫాలో అవ్వడు - సెట్ చేస్తాడు-pawan kalyan birthday special beyond irrespective of success and failure power star rises ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pawan Kalyan Birthday Special Beyond Irrespective Of Success And Failure Power Star Rises

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ట్రెండ్ ను ఫాలో అవ్వడు - సెట్ చేస్తాడు

HT Telugu Desk HT Telugu
Sep 02, 2022 06:48 AM IST

Pawan Kalyan Birthday:టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. సక్సెస్ ఫెయిల్యూర్స్ కు అతీతంగా పవర్ స్టార్ గా అభిమానులు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ బర్త్ డే నేడు. అతడికి యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ (Twitter)

Pawan Kalyan Birthday:సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్‌కే ఎక్కువ విలువ ఉంటుంది. స‌క్సెస్‌లో ఉన్న‌వాడి మాటే చెల్లుబాటు అవుతుంది. వారి చుట్టే ఇండ‌స్ట్రీ మొత్తం తిరుగుతుంది. కానీ కొంద‌రు న‌టులు మాత్రం స‌క్సెస్‌ల‌కు అతీతంగా తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను క‌లిగి ఉంటారు. ఎన్నిఫ్లాప్ లు వ‌చ్చినా వారి ఇమేజ్ త‌గ్గిపోదు స‌రిక‌దా మ‌రింత పెరుగుతూనే ఉంటుంది. అందుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు.

ఇర‌వై ఆరేళ్ల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసింది కేవ‌లం 27 సినిమాలు మాత్ర‌మే. అందులో చాలా వ‌ర‌కు ప‌రాజ‌యాలే ఉన్నాయి. కానీ ప‌వ‌న్ మాత్రం మ‌కుటం లేని మ‌హారాజుగా కొన‌సాగుతున్నాడు. గ‌బ్బ‌ర్‌సింగ్‌, అత్తారింటికి దారేది త‌ర్వాత ప‌వ‌న్ కు ఆ స్థాయి సక్సెస్ దక్కి చాలా కాలమైంది. అయినా అత‌డి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది త‌ప్పితే త‌గ్గ‌లేదు. అజ్ఞాత‌వాసి, స‌ర్ధార్‌గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలు ఫ్లాప్ అయినా టాలీవుడ్‌లో తొలిరోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో అవి ఉన్నాయంటే పవన్ పై అభిమానుల్లో ఉన్న అంతులేని అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

వ‌కీల్‌సాబ్‌, భీమ్లానాయ‌క్ సినిమాలు యావ‌రేజ్ టాక్‌తో వంద కోట్ల‌కుపై వ‌సూళ్ల‌ను సాధించాయంటే పవన్ ఛరిష్మానే కారణం. మిగిలిన న‌టుల‌తో పోలిస్తే ప‌వ‌న్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ భిన్నంగా ఉంటుంది. విల‌క్ష‌ణ‌మైన డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్‌తో అభిమానుల‌ను అల‌రిస్తుంటారు. న‌టుడిగా ఆ విల‌క్ష‌ణీయ‌తే ప‌వ‌న్‌ను స్టార్‌హీరోల్లో ఒక‌రిగా నిల‌బెట్టింది.

హీరోలు అత‌డి అభిమానులే..

సాధార‌ణంగా హీరోలకు అభిమానులు ఉండ‌టం ఓ ప‌రిపాటి. కానీ ప‌వ‌న్ విష‌యంలో పూర్తి భిన్నంగా క‌నిపిస్తుంటుంది. ఇప్పుడున్న యూత్ హీరోల్లో చాలా మంది ప‌వ‌న్‌కు వీరాభిమానులు కావ‌డం గ‌మ‌నార్హం. నితిన్ త‌న ప్ర‌తి సినిమాలో ప‌వ‌న్ పేరు. అత‌డి స్టైల్‌ను అనుక‌రిస్తూ త‌న అభిమానాన్ని చాటుకుంటాడు. నిఖిల్‌, రానా, నాని తో పాటు చాలా మంది యంగ్ హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై త‌మ‌కున్న అభిమానాన్నిసందర్భం దొరికిన ప్రతిసారి చాటుకుంటూనే ఉన్నారు. ప్రజెంట్ టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో చాలా మంది ప‌వ‌న్ ఫ్యాన్స్ ఉన్నారు. అత‌డితో సినిమా చేయాలనే డ్రీమ్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంటుంది.

సినిమాలు లేదంటే పుస్తకాలు...

టాలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. కానీ ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సాదాసీదాగా క‌నిపిస్తుంది. ఆడంబ‌రాల‌కు దూరంగా సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతుంటారు. సినిమాలు, రాజ‌కీయాలు కాకుండా పుస్త‌క ప‌ఠ‌నానికి ప‌వ‌న్ అధికంగా ప్రాధాన్య‌మిస్తుంటారు. త‌నను క‌ల‌వ‌డానికి వచ్చిన వారందరికి పుస్త‌కాల‌ను బహుమతిగా అందిస్తుంటారు. పుస్తకాన్ని ప్రేమించండి...విజ్ఆ న ప్రపంచంలో జీవించండి అంటూ పలుమార్లు సోషల్ మీడియా ద్వారా పుస్తక పఠనం గొప్పతనాన్ని చాటిచెప్పారు

వదులుకున్న సినిమాలే ఎక్కువ...

ప‌వ‌న్ కెరీర్‌లో చేసిన సినిమాల‌కంటే వ‌దులుకున్న సినిమాల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. అత‌డు, పోకిరి, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి, ఇడియ‌ట్ ఇలా... టాలీవుడ్ హీరోల‌కు లైఫ్ ఇచ్చిన ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాలు తొలుత ప‌వ‌న్ వ‌ద్ద‌కే వ‌చ్చాయి. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆయ‌న తిర‌స్క‌రించ‌డంతో ఇత‌ర హీరోలు ఆ సినిమాల్లో న‌టించి హిట్స్ కొట్టారు. హీరోగా త‌రుణ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన నువ్వే కావాలి సినిమా మొదట ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సింది. చెప్పాల‌ని ఉంది పేరుతో ఈ సినిమాను తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కపోవడంతో త‌రుణ్ తో సినిమాను పూర్తిచేశారు.

జానీ త‌ర్వాత స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో స‌త్యాగ్ర‌హి అనే సినిమాను అనౌన్స్ చేశాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అనౌన్స్‌మెంట్‌తోనే సినిమాకు ప్యాక‌ప్ ప‌డింది. దేశ‌భ‌క్తి ప్ర‌ధాన క‌థాంశంతో దేశీ, సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ ఆఫ్ పీస్ సినిమాలు ప్రకటనలకే ప‌రిమిత‌మ‌య్యాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కొబాలి పేరుతో ఓ సినిమా చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్నారు. కానీ ఆ సినిమా మెటిరియ‌లైజ్ కాలేదు.

వి.వి వినాయ‌క్‌, జ‌యంత్ సీ ప‌రాన్జీ, లారెన్స్ తో పాలు ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో ప‌వ‌న్ సినిమాల‌కు అనౌన్స్ మెంట్స్ తర్వాత ఆగిపోయాయి. ప్రస్తుతం రాజకీయాలపై దృష్టిసారిస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ కథాంశంతో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. సముద్రఖని, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లతో పవన్ సినిమాలు చేయాల్సిఉంది.

IPL_Entry_Point