ఒకటేమో పాట చుట్టూ సాగే మిస్టరీ సినిమా..మరొకటేమో సూపర్ నేచురల్ థ్రిల్లర్..ఓటీటీలోకి రెండు మలయాళం సినిమాలు..ఇక్కడ చూసేయండి-pattth and vadakkan movie ott release on aha tamil and manorama max emotional story drama super natural thriller ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఒకటేమో పాట చుట్టూ సాగే మిస్టరీ సినిమా..మరొకటేమో సూపర్ నేచురల్ థ్రిల్లర్..ఓటీటీలోకి రెండు మలయాళం సినిమాలు..ఇక్కడ చూసేయండి

ఒకటేమో పాట చుట్టూ సాగే మిస్టరీ సినిమా..మరొకటేమో సూపర్ నేచురల్ థ్రిల్లర్..ఓటీటీలోకి రెండు మలయాళం సినిమాలు..ఇక్కడ చూసేయండి

మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. డిఫరెంట్ జోనర్ లో వచ్చే ఈ మూవీస్ బౌండరీలు లేకుండా అన్ని రాష్ట్రాల ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి. తెలుగులోనూ మలయాళం సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. ఇప్పుడు ఒకే రోజు రెండు మలయాళం సినిమాలు ఓటీటీలోకి దూసుకొచ్చాయి. ఆ సినిమాల వివరాలు మీకోసం.

ఓటీటీలోకి రెండు మలయాళం సినిమాలు (x)

ఫ్యాన్స్ కు థ్రిల్ అందించడంతో పాటు ఎమోషనల్ జర్నీలోకి తీసుకొచ్చేందుకు ఒకే రోజు రెండు మలయాళం సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. ఇందులో ఒకటేమో పాట చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామా ‘పాతు’ మూవీ కాగా.. మరొకటేమో పారానార్మల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘వడక్కన్’. ఈ రెండు మలయాళం సినిమాలు ఈ రోజు (జూన్ 6) ఓటీటీలో అడుగుపెట్టాయి. ఆ మూవీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం.

డైరెక్ట్ గా ఓటీటీలోకి

మలయాళం ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ ‘పాతు’ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 2024 కేరళ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేసింది. మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం భాషలో ఈ మూవీ వచ్చేసింది.

పాట చుట్టూ

పాతు సినిమా పాట చుట్టూ తిరుగుతుంది. ఓ ట్రావెల్ వ్లాగ్ ను ఉన్ని ఎడిట్ చేస్తుంటాడు. ఇందులో కెన్యా నేటివ్స్ కు చెందిన అరుదైన ట్రైబల్ సాంగ్ ఉంటుంది. ఈ పాటను ఉన్ని గ్రాండ్ మదర్ గుర్తించి పాడుతుంది. ఆమె పాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పెడితే తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆ పాటతో ఇంతమందికి ఉన్న కనెక్షన్ ఏంటీ? దీని వెనుకు ఉన్న మిస్టరీ ఏంటీ అనేది వెతుకుతూ తన గర్ల్ ఫ్రెండ్ తో హీరో చేసే జర్నీనే ఈ పాతు సినిమా.

ఇంకోదాంట్లో డిజిటల్ స్ట్రీమింగ్

మరోవైపు ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో రిలీజైన వడక్కన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మలయాళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేసింది. ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ఫస్ట్ పారానార్మల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మే 5 న ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇంగ్లిష్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

వడక్కన్ ఇప్పుడు మరో ఓటీటీలో అడుగుపెట్టింది. ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైంది.

టీవీ రియాలిటీ షోలో హత్యలు

వడక్కన్ మూవీ పారానార్మల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఓ టీవీ రియాలిటీ షో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారనేది అంతుబట్టదు. ఈ మిస్టరీని ఛేదించేందుకు కిశోర్ రంగంలోకి దిగుతాడు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ లో కిశోర్ ఈ మూవీలో యాక్టింగ్ తో అదరగొట్టాడు. అయితే ఈ హత్యలకు కారణం ఎవరనేది విచారించే క్రమంలో పురాతన సంప్రదాయాలకు సంబంధించిన డార్క్ సీక్రెట్స్ బయటపడతాయి.

ద్రావిడ జానపద కథల్లోని అతీంద్రియ శక్తిని ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పొందుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం