OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి తంగలాన్ హీరోయిన్ మలయాళం మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
OTT: తంగలాన్ ఫేమ్ పార్వతి హీరోయిన్‌గా నటిస్తోన్న మలయాళం మూవీ హర్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఆంథాలజీ మూవీలో పార్వతితో పాటు ఐశ్వర్యరాజేష్, రమ్య నంబీశన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
ఇటీవలే తంగలాన్ మూవీతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించింది. పార్వతిN తిరువోత్తు. గంగమ్మ పాత్రలో ఐదుగురు బిడ్డల తల్లిగా తన నటనతో ఆకట్టుకుంటుంది. తంగలాన్ తర్వాత హార్ మూవీలో పార్వతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆంథాలజీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త్వరలో హర్ మూవీ విడుదల తేదీని వెల్లడిస్తామని ఓటీటీ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. డిసెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు.
ముగ్గురు హీరోయిన్లు...
హర్ మూవీలో పార్వతితో ఐశ్వర్య రాజేష్, రమ్య నంబీశన్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. లిజోమోల్ జోస్, ఊర్వశి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు లిజిన్ జోస్ దర్శకత్వం వహిస్తోన్నారు. మొత్తం ఐదు కథలతో ఈ అంథాలజీ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సత్యం సుందర, 96 ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్ అందిస్తోన్నాడు. హర్ మూవీలో నటుడు ప్రతాప్ పోతన్ నటించాడు. ఇటీవలే అతడు కన్నుమూయడం గమనార్హం.
రెమ్యునరేషన్ తగ్గించుకొని...
కథ నచ్చడంతో పార్వతి, ఐశ్వర్య రాజేష్‌తో పాటు రమ్య నంబీశన్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకొని ఈ మూవీ చేస్తోన్నట్లు సమాచారం. మలయాళంలో కమర్షియల్ సినిమాలు, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోన్న పార్వతి ఎక్కువగా కథాబలమున్న సినిమాలు చేస్తోంది. నేషనల్ అవార్డుతో పాటు పలు పురస్కారాలను దక్కించుకున్నది.
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీలో...
తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ అడపాదడపా మలయాళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్‌తో పాటు టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాలు చేసింది.
ప్రస్తుతం వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న సంక్రాంతికి వస్తోన్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా నటిస్తోంది. సంక్రాంతికి వస్తోన్నాం సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నది. సంక్రాంతికి వస్తోన్నాంతో పాటు మరో ఐదు సినిమాలు చేస్తోంది ఐశ్వర్య రాజేష్.