Pareshan Movie OTT: పరేషాన్ సినిమా వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే..-pareshan movie locks its ott deal to sony liv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pareshan Movie Locks Its Ott Deal To Sony Liv

Pareshan Movie OTT: పరేషాన్ సినిమా వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 02, 2023 04:18 PM IST

Pareshan Movie OTT: తిరువీర్ హీరోగా తెరకెక్కిన పరేషాన్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను లాక్ చేసుకుంది. నేడే ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పరేషాన్ సినిమా పోస్టర్
పరేషాన్ సినిమా పోస్టర్

Pareshan Movie OTT: తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా పరేషాన్ మూవీ తెరకెక్కింది. ‘మసూదా’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు (జూన్ 2) థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమర్పణలో వచ్చిన ఈ పరేషాన్ సినిమా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. అయితే, తిరువీర్ నటనకు మాత్రం జనాలు ఫిదా అయిపోతున్నారు. కాగా, ఈ పరేషాన్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ డీల్ లాక్ చేసుకుంది.

సోనీ లివ్ (Sony Liv) ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో పరేషాన్ సినిమా రానుంది. ఆ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను చేజిక్కించుకుంది. అయితే, సోనీ లివ్‍లో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. ఈ చిత్రం నేడే విడుదల కావటంతో ఓటీటీలోకి వచ్చే సరికి మరిన్ని వారాలు పట్టే అవకాశం ఉంది.

రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో పరేషాన్ సినిమా రూపొందింది. ఈ సినిమాలో తిరువీర్‌కు జోడీగా పావని కరణం నటించింది. సిద్దార్థ్ రాళ్లపల్లి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. వాల్తేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మితమైంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమర్పించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించగా.. వాసు పెండెం సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.

జార్జిరెడ్డి, టక్ జగదీశ్ సినిమాలతో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు తిరువీర్. ఇక ఆ తర్వాత హర్రర్ మూవీ ‘మసూద’ సినిమాలో హీరోగా నటించి అదరగొట్టాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. కమర్షియల్‍గానూ మసూద మూవీ మంచి విజయాన్ని సాధించింది. దీంతో పక్కా హీరోగా మారిపోయాడు తిరువీర్. పరేషాన్‍లో తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్నాడు.

IPL_Entry_Point