OTT Malayalam Revenge Thriller: ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం రివేంజ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
OTT Malayalam Revenge Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఒక రోజు ముందే వచ్చేసింది. నిజానికి గురువారం (జనవరి 16) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా.. బుధవారం సాయంత్రమే అడుగుపెట్టింది.
OTT Malayalam Revenge Thriller: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం రివేంజ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. స్టార్ నటుడు జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ పేరు పని (Pani). ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే మూవీ రావడం విశేషం.

"అడ్రెనలైన్ ఎలా ఉంటుందో చూడండి. రేజ్ ఎలా ఉంటుందో చూడండి. పని ఇప్పుడు సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది. తెలుగులోనూ మూవీ అందుబాటులోకి రావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో గతేడాది అక్టోబర్ 24న రిలీజైన పని మూవీ సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది.
పని మూవీ ఎలా ఉందంటే?
థ్రిల్లర్ కథాంశాలతో సినిమాలను అద్భుతంగా తీర్చిదిద్దే మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో హిట్ మూవీ పని. ఈ సినిమా సాగర్ సూర్య, జునైజ్ వీపీ అనే ఇద్దరు మెకానిక్స్ చుట్టూ తిరుగుతుంది. త్రిసూర్ లో ఉండే ఈ ఇద్దరూ నేర ప్రపంచంలో గుర్తింపు కోసం ఓ వ్యక్తిని చంపాలని అనుకుంటారు.
అయితే అప్పటికే త్రిసూర్ సిటీని ఏలుతున్న గిరి గ్యాంగ్ తో చేతులు కలపాలని వీళ్లు భావిస్తారు. అతని చేతుల్లో అవమాన పడ్డ తర్వాత గిరి కుటుంబానికి హాని కలిగించడానికి చూస్తుంటారు. ఆ ఇద్దరి నుంచి గిరి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్నదే ఈ పని మూవీ స్టోరీ. ఇదొక రివేంజ్ థ్రిల్లర్ మూవీ. ఈ జానర్ సినిమాలు ఇష్టపడే వారిని పని మూవీ అలరిస్తుంది.
ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతోపాటు ఇందులో గిరి అనే పాత్రలోనూ జోజు జార్జ్ నటించాడు. ఈ సినిమాలో అతనితోపాటు అభినయ, బాబీ కురియన్, చాందిని శ్రీధరన్, సుజిత్ శంకర్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రూ.33 కోట్లు వసూలు చేసింది.