OTT Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ..
OTT Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా పేరు పని. ప్రముఖ నటుడు జోజూ జార్జ్ తొలిసారి ఈ సినిమా ద్వారానే డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
OTT Action Thriller Movie: మలయాళం మూవీ.. అందులోనూ యాక్షన్ థ్రిల్లర్.. ప్రముఖ నటుడు జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా.. ఇలాంటి మూవీ ఇప్పుడు సుమారు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సోమవారం (జనవరి 6) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇంతకీ ఈ సినిమా పేరేంటో తెలుసా? పని.
పని ఓటీటీ రిలీజ్ డేట్
ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ పని (Pani). గతేడాది అక్టోబర్ 24న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర రూ.60 కోట్లు వసూలు చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పుడు జనవరి 16 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
"గ్రిప్పింగ్ రివేంజ్ డ్రామా.. జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన మూవీ పని జనవరి 16 నుంచి సోనీలివ్ లోకి రాబోతోంది" అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
పని మూవీ స్టోరీ ఏంటంటే?
పని (Pani) మూవీ మలయాళ యాక్షన్ థ్రిల్లర్. జోజు జార్జ్ కథ అందించి డైరెక్ట్ చేశాడు. అతడే లీడ్ రోల్లోనూ నటించాడు. అతనితోపాటు సాగర్ సూర్య, జునైట్ వీపీ, బాబీ కురియన్, అభినయ, అభయ హిరణ్మయిలాంటి వాళ్లు నటించారు. ఇందులో గిరి అనే పాత్రలో జోజు నటించాడు. త్రిసూర్ లో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్, అది ఓ జంట జీవితాలను ఎలా మార్చేస్తుందన్నదే ఈ పని మూవీ స్టోరీ.
ఓ నటుడిగా, దర్శకుడిగా జోజు జార్జ్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రూ.60 కోట్లు వసూలు చేసింది. అయితే ఓటీటీ రిలీజ్ మాత్రం ఆలస్యమవుతూ వచ్చింది. గత డిసెంబర్ లోనే డిజిటల్ ప్రీమియర్ అవుతుందని భావించినా.. సాధ్యం కాలేదు. మొత్తానికి జనవరి 16 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.