Panchayat Season 4: బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. మొదలైన షూటింగ్.. ఫొటోలు వైరల్-panchayat web series season 4 shooting begins prime video to stream the news season in summer 2026 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Panchayat Season 4: బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. మొదలైన షూటింగ్.. ఫొటోలు వైరల్

Panchayat Season 4: బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. మొదలైన షూటింగ్.. ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu
Oct 30, 2024 08:48 AM IST

Panchayat Season 4: బ్లాక్‌బస్టర్ రూరల్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది. ఈ కొత్త సీజన్ షూటింగ్ మొదలైనట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.

బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. మొదలైన షూటింగ్.. ఫొటోలు వైరల్
బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. మొదలైన షూటింగ్.. ఫొటోలు వైరల్

Panchayat Season 4: ఓటీటీల్లో ఎన్నో వెబ్ సిరీస్ వచ్చాయి. అందులో మనసుకు హత్తుకునేలా నిలిచిపోయేవి కొన్నే అని చెప్పొచ్చు. అందులో ఒకటి పంచాయత్ (Panchayat). అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికే ఈ సిరీస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. ఇప్పుడీ రూరల్ కామెడీ డ్రామా నాలుగో సీజన్ కు సిద్ధమవుతోంది.

పంచాయత్ నాలుగో సీజన్

పంచాయత్ వెబ్ సిరీస్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ సిరీస్ నాలుగో సీజన్ షూటింగ్ మొదలైనట్లు వెల్లడించింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. "వీళ్లు మళ్లీ వచ్చేశారు. నాలుగు కప్పుల చాయ్ చెప్పండి.. పంచాయత్ సీజన్ 4 షూటింగ్ మొదలైంది" అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియోలో తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది.

ఈ సందర్భంగా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇందులో వెబ్ సిరీస్ లో పాపులరైన ఫులేరా ఊరి పంచాయతీ భవనంతోపాటు ఆ గ్రామ పరిసరాలను కూడా చూడొచ్చు. ఇక సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్ లపై షూటింగ్ జరగడం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.

పంచాయత్ వెబ్ సిరీస్ గురించి..

పంచాయత్ వెబ్ సిరీస్ ఓ రూరల్ కామెడీ డ్రామా. 2019లో తొలి సీజన్ వచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండా అప్పట్లో రిలీజై ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మరో రెండు సీజన్లు కూడా వచ్చాయి. ఈ ఏడాదే మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరించింది.

ఫులేరా గ్రామ పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠీని ట్రాన్స్‌ఫర్ చేయడంతో రెండో సీజన్ ముగుస్తుంది. మూడో సీజన్ అక్కడి నుంచే మళ్లీ మొదలైంది. కొత్తగా వచ్చిన సెక్రటరీకి ఊళ్లో ఎవరూ సహకరించకపోవడంతో అతడు తిరిగి వెళ్లిపోతాడు. మళ్లీ అభిషేక్ ను తీసుకురావడానికి అక్కడి సర్పంచ్, ఉప సర్పంచ్ లు గట్టిగానే ప్రయత్నిస్తారు. అతడు తిరిగి రావడంతో మూడో సీజన్లో వీళ్ల సరదా మళ్లీ మొదలవుతుంది.

అయితే స్థానిక ఎమ్మెల్యేతో ఫులేరా ఊళ్లో వాళ్ల గొడవలు మరింత ముదరడం ఈ మూడో సీజన్లో చూడొచ్చు. చివరికి సర్పంచ్ పై హత్యా ప్రయత్నం జరగడం, దానికి ఎమ్మెల్యేనే కారణం అనుకొని అతనితో వాళ్లు గొడవకు దిగడం.. చివర్లో అందరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో మూడో సీజన్ ముగిసింది. ఇదే నాలుగో సీజన్ పై ఆసక్తి రేపేలా చేసింది. ఈ కొత్త సీజన్ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Whats_app_banner