హిందీ వెబ్ సిరీస్ ల్లో పంచాయత్ సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ విలేజ్ లో పొలిటికల్ డ్రామాగా వచ్చే ఈ సిరీస్ లో కామెడీకి కొదవ ఉండదు. తొలి మూడు సీజన్లు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేసింది. మంగళవారం (జూన్ 24) నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పంచాయత్ సీజన్ 4 వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే వారం రోజుల ముందే ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ రోజు నుంచే ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. ఈ హిందీ వెబ్ సిరీస్ ఈ సారి మరింత ప్రత్యేకంగా రెడీ అయింది. ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూసిన ఆ టైమ్ రానే వచ్చింది.
ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 4 ట్రైలర్‌ను ఒక వారం క్రితం విడుదల చేసి, ఓటీటీ విడుదల తేదీ ముందుకు తెచ్చినట్లు నిర్మాతలు ధ్రువీకరించారు. ఈ సిరీస్ తో జితేంద్ర కుమార్, నీనా గుప్తా మరోసారి ఆడియన్స్ ను మెప్పించడానికి వచ్చేశారు. ఈ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ట్రైలర్ తోనే అంచనాలు పెరిగిపోయాయి.
మొదటి మూడు సీజన్ల భారీ విజయం తరువాత.. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ సూపర్ హిట్ రాజకీయ డ్రామా పంచాయత్ కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశారు. ఈ సిరీస్ మధ్యప్రదేశ్‌లోని మహోడియా గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో షూట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన్, భూషణ్ శిబిరాల మధ్య ఫైట్ ఇందులో చూడొచ్చు.
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన పంచాయత్ సీజన్ 4 వెబ్ సిరీస్ ఉత్తరప్రదేశ్‌లోని ఫులేరా అనే ఒక దూరప్రాంత గ్రామం చుట్టూ సాగుతుంది. అక్కడ పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథ కీలకం. ఈ కొత్త సిరీస్ పంచాయతీ సీజన్ 3 క్లిఫ్‌హాంగర్ నుంచి ప్రారంభమై జితేంద్ర కుమార్, సచివ్ జీ, నీనా గుప్తా, మంజు దేవి ఇలా అందరి చుట్టూ తిరుగుతుంది. పొలిటికల్ డ్రామా, కామెడీతో పాటు లవ్ యాంగిల్ కూడా ఈ సిరీస్ లో మెప్పించేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.
సంబంధిత కథనం