Rashmika Mandanna: ఫ్యాషన్ డిజైనర్ పెళ్లికి తరలొచ్చిన సినీ తారలు, స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక, విజయ్ దేవరకొండ
Fashion Designer Shravya Varma: ఆర్జీవీకి మేనకోడలైన శ్రావ్య వర్మ టాలీవుడ్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతోంది. హీరోయిన్లు రష్మిక మంధాన, కీర్తి సురేష్ ఈమెకి బెస్ట్ ఫ్రెండ్స్‌కాగా.. షట్లర్ కిందాంబి శ్రీకాంత్‌ని తాజాగా శ్రావ్య వర్మ వివాహం చేసుకుంది.
టాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ పెళ్లి సినీ తారలు తరలొచ్చారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకి మేనకోడలైన శ్రావ్య వర్మ.. టాలీవుడ్‌లో చాలా మంది నటులకి ఫ్యాషన్ డిజైర్‌గా ఉన్నారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రావ్య వర్మ తాజాగా హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో అతడ్ని పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకి హీరోలు, హీరోయిన్స్, దర్శకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అట్రాక్షన్‌గా విజయ్, రష్మిక
శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక మంధాన, విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. విజయ్ తన ఫ్యామిలీతో కలిసి రాగా.. రష్మిక ఒంటరిగానే ఈ వివాహానికి వచ్చింది. గత కొన్నేళ్లుగా రష్మిక, విజయ్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ విషయాన్ని ఈ జంట ధ్రువీకరించలేదు. మేము జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్తుంటుంది. కానీ లెక్కలేనన్ని సార్లు ఈ జంట బయట చక్కర్లు కొడుతూ నెటిజన్లకి దొరికిపోయింది.
కీర్తి సురేష్‌తో అనుబంధం
శ్రావ్య వర్మ పెళ్లికి సీనియర్ హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా హాజరైంది. ఆమె నటించిన గుడ్ లక్ సఖి సినిమాకి శ్రావ్య వర్మ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించింది. దాంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. అలానే దర్శకులు నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి తదితరులు ఈ వివాహ వేడుకకి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.