Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వనున్నారా? పల్లవి ప్రశాంత్ విషయంలో.. మరో కంటెస్టెంట్ ఎంట్రీ ఖరారు!-pallavi prashanth may going to secret room in bigg boss 7 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Pallavi Prashanth May Going To Secret Room In Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వనున్నారా? పల్లవి ప్రశాంత్ విషయంలో.. మరో కంటెస్టెంట్ ఎంట్రీ ఖరారు!

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వనున్నారా? పల్లవి ప్రశాంత్ విషయంలో..  మరో కంటెస్టెంట్ ఎంట్రీ కన్ఫర్మ్!
Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ భారీ ట్విస్ట్ ఇవ్వనున్నారా? పల్లవి ప్రశాంత్ విషయంలో..  మరో కంటెస్టెంట్ ఎంట్రీ కన్ఫర్మ్!

Bigg Boss 7 Telugu: బిగ్‍‍బాస్ తెలుగు 7వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రెండో వారంలో పల్లవి ప్రశాంత్ ఓటింగ్ పరంగా లీడింగ్‍లో ఉన్నారు. ఈ తరుణంలో ఓ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: బిగ్‍‍బాస్ తెలుగు 7వ సీజన్ రెండో వారం హాట్‍హాట్‍గా సాగుతోంది. గొడవలు, వాగ్వాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. తొలి వారంతో పోలిస్తే ఓటింగ్ కూడాా తారుమారు అయింది. రతిక రోజ్ పాపులారిటీ పడిపోతున్నట్టు ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. మరోవైపు హౌస్‍లో ఎక్కువగా టార్గెట్ అవుతున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఓటింగ్‍లో దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో బిగ్‍బాస్ హౌస్‍లో ఆట మరింత రసవత్తరంగా మారింది. రెండో వారం నామినేషన్ల నుంచే గేమ్ హీటెక్కింది. అది ఇంకాస్త ఎక్కువవుతోంది. ఈ తరుణంలో బిగ్‍బాస్ ట్విస్ట్ ఇస్తారంటూ లీక్‍లు వచ్చాయి. అదేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ రెండో వారంలో ఒకరి కంటే ఎక్కువ మందినే హౌస్ నుంచి బిగ్‍బాస్ ఎలిమినేట్ చేస్తారని సోషల్ మీడియాలో లీక్‍లు వస్తున్నాయి. ఇద్దరు హౌస్ నుంచి బయటికి వెళ్తారని వినిపిస్తోంది. అయితే, రెండో వారంలో అందరికీ టార్గెట్ అయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‍గా మారిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍ను బిగ్‍బాస్ ఎలిమినేట్ చేసినట్టు చేసి.. సీక్రెట్ రూమ్‍కు పంపుతారని టాక్ వినిపిస్తోంది. బిగ్‍బాస్ 3వ సీజన్‍లో రాహుల్ సిప్లిగంజ్‍ను ఇలాగే సీక్రెట్ రూమ్‍కు పంపారు. ఇప్పుడు 7వ సీజన్‍లో పల్లవి ప్రశాంత్‍ను ఆ రహస్య రూమ్‍కు పంపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఎంత వరకు నిజమవుతుందనేది ఈ వీకెండ్ ఎపిసోడ్లలో తేలనుంది. ఒకవేళ సీక్రెట్ రూమ్‍కు పంపితే పల్లవి ప్రశాంత్‍కు స్క్రీన్ టైమ్ పెరిగి.. అతడికి మరింత ఆదరణ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

మరోవైపు, ఈ వారం బిగ్‍బాస్ హౌస్‍ నుంచి షకీల ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. వయసురీత్యా ఆమె హౌస్‍లో అంత యాక్టివ్‍గా ఉండలేకపోతున్నారు. టాస్కుల్లోనూ చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. అలాగే, ఓటింగ్‍లో కూడా వెనుకపడి ఉన్నారు. దీంతో ఆమె ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది.

ఇక, బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో మరో సీరియల్ నటుడు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ అంబటి అర్జున్ హౌస్‍లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆరంభంలోనే ఆయన బిగ్‍బాస్ 7 తెలుగులో కంటెస్టెంట్‍గా వస్తారని బాగా బజ్ నడిచింది. అయితే, అలా జరగలేదు. దీంతో వైల్డ్ కార్డ్ ద్వారా అంబటి అర్జున్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టు వినిపిస్తోంది. మరి, ఈ వారమే ఆయన ఆగమనం ఉంటుందేమో చూడాలి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.