Telugu Singing Tv Shows: డిజిటల్ ట్రెండ్ పెరిగిన తర్వాత వారానికో కొత్త రియాలిటీ షో ప్రారంభమవుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో రూపొందుతోన్న ఈ షోలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అయితే పోటీ ప్రపంచంలో ఓ రియాలిటీ షో రెండు, మూడేళ్లు టెలికాస్ట్ కావడమే గ్రేట్. కానీ సింగింగ్ రియాలిటీ షో మాత్రం 27 ఏళ్లుగా టెలికాస్ట్ అవుతోనే ఉంది. ఆ షో ఏదంటే పాడుతా తీయగా.,దివంగత లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా 1996 జనవరి 12న ఈ పాడుతా తీయగా షో ఈటీవీలో ప్రారంభమైంది. ఈ పాడుతా తీయగా సింగింగ్ షో ద్వారా ఎంతో మంది తెలుగు సింగర్స్ వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ సినీ గాయనీగాయకులుగా వెలుగొందుతున్న గీతామాధురి, ఉష, మల్లిఖార్జున్, కారుణ్యతో పాటు చాలా మంది పాడుతా తీయగా ద్వారానే సినీ పరిశ్రమకు పరిచయం కావడం గమనార్హం.,చిన్న చిన్న మార్పులతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న ఈ షో బాలసుబ్రహ్మణ్యం మరణం తర్వాత కొద్ది రోజుల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన తనయుడు ఎస్.పి.చరణ్ హోస్ట్‌గా తండ్రి స్థానంలో పాడుతా తీయగా లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడితో మళ్లీ కొత్తగా పాడుతా తీయగా షోను ప్రారంభించారు.