Padma Awards 2025: బాలకృష్ణతో పాటు సినీ రంగం నుంచి పద్మ భూషణ్ వరించింది వీరినే! కళల్లో 48 మంది- సౌత్ నుంచి నలుగురు!
Padma Awards 2025 In Arts With Balakrishna Ajith Shobana: 76వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా తాజాగా పద్మ అవార్డ్స్ 2025ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కళలో విభాగంలో మొత్తంగా 48 మందికి ఈ పురస్కారాలు వరించగా.. వారిలో సౌత్ నుంచి నలుగురు ఉన్నారు. వారిలో బాలకృష్ణతోపాటు మరో ముగ్గురు ఉన్నారు.
Padma Awards 2025 In Arts With Balakrishna Ajith: 2025 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ మూడు అవార్డులు కలిపి మొత్తంగా 139 మందికి వచ్చాయి.

కళల విభాగంలో 48 మందికి
పద్మ విభూషణ్ అవార్డ్‌కు ఏడుగురు, పద్మ భూషణ్‌కు 19 మంది, పద్మ శ్రీ పురస్కారాలను 113 మంది అందుకోనున్నారు. అయితే, వీరిలో బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇలా సినీ రంగం లేదా కళల విభాగంలో మొత్తంగా 48కి పద్మ అవార్డ్స్ వరించాయి. వీరిలో సౌత్ నుంచి సినీ రంగం విభాగంలో నలుగురు పద్మ భూషణ్‌కు ఎంపిక అయ్యారు.
సినీ రంగం నుంచి ఐదురికి
ఆంధ్ర ప్రదేశ్ నుంచి బాలకృష్ణకు, కన్నడ నటుడు అనంత్ నాగ్ (కర్ణాటక), తమిళ స్టార్ హీరో ఎస్ అజిత్ కుమార్ (తమిళనాడు), బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ (మహారాష్ట్ర), సీనియర్ హీరోయిన్, నృత్యకారిణి శోభన చంద్రకుమార్ (తమిళనాడు)లకు పద్మ భూషణ్ అవార్డ్‌లు వరించాయి. సినీ రంగం నుంచి ఐదుగురికి పద్మ భూషణ్ పురస్కారం వరించగా.. వారిలో సౌత్ నుంచి బాలయ్య, అజిత్, శోభన, అనంత్ నాగ్ నలుగురు ఉన్నారు.
కళల్లో పద్మ విభూషణ్ (3) అందుకున్న వారు:
కుముదిని రజనీకాంత్ లాఖియ- గుజరాత్
లక్ష్మీ నారాయణ సుబ్రమణియం- కర్ణాటక
శారదా సిన్హా (మరణానంతరం)- బిహార్
కళల్లో పద్మశ్రీ అవార్డ్స్ (40) అందుకున్న వారు:
అద్వైత చరణ్ గడనాయక్- ఒడిశా
అచ్యుత్ రామచంద్ర పలవ్- మహారాష్ట్ర
అర్జిత్ సింగ్- పశ్చిమ బెంగాల్
అశోక్ లక్ష్మణ్ షరాఫ్- మహారాష్ట్ర
అశ్విని భిడే దేశ్‌పాండే- మహారాష్ట్ర
బ్యారీ గాడ్‌ఫ్రే జాన్- ఎన్‌సీటీ దిల్లీ
బేగమ్ బతోల్- రాజస్థాన్
భరత్ గుప్త్- ఎన్‌సీటీ దిల్లీ
బేరు సింగ్ చౌహాన్- మధ్యప్రదేశ్
భీమవ్వ దొడ్డబాలప్ప- కర్ణాటక
దుర్గాచరణ్ రణ్‌బీర్- ఒడిశా
ఫరూక్ అహ్మద్ మిర్- జమ్మూకశ్మీర్
గోకుల్ చంద్ర దాస్- పశ్చిమ బెంగాల్
గురువాయుర్ దొరై- తమిళనాడు
హర్‌చందన్ సింగ్ భట్టీ- మధ్య ప్రదేశ్
హర్జిందర్ సింగ్ శ్రీనగర్‌వాలే- పంజాబ్
హసన్ రఘు- కర్ణాటక
జస్పీందర్ నరూలా- మహారాష్ట్ర
మాడుగుల నాగఫణిశర్మ- ఆంధ్రప్రదేశ్
మిరియాల అప్పారావు (మరణానంతరం)- ఆంధ్రప్రదేశ్
జోయ్‌నాంచారన్ బతారీ- అస్సాం
కె. ఓమనకుట్టి అమ్మ- కేరళ
మహాబీర్ నాయక్- ఝార్ఖండ్
మమతా శంకర్- పశ్చిమ బెంగాల్
నరేన్ గురుంగ్- సిక్కిం
నిర్మలా దేవీ- బిహార్
పి. దచనమూర్తి- పుదుచ్చేరి
పాండీ రామ్ మందవీ- ఛత్తీస్‌గఢ్
పార్మర్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్- గుజరాత్
రాధాకృష్ణ దేవసేనాపతి- తమిళనాడు
రణేంద్ర భాను మజుందార్- మహారాష్ట్ర
రతన్ కుమార్ పరిమో- గుజరాత్
రెబాకాంత మహంత- అస్సాం
రికీ జ్ఞాన్ కేజ్- కర్ణాటక
శ్యామ్ బిహారి అగర్వాల్- ఉత్తర్‌ప్రదేశ్
తేజేంద్ర నారాయణ్ మజుందార్ - పశ్చిమ బెంగాల్
తీయం సూర్యముఖి దేవి- మణిపుర్
వాసుదేవ్ కామత్- మహారాష్ట్ర
వేళు ఆసాన్- తమిళనాడు
వెంకప్ప అంబాజీ సుగటేకర్- కర్ణాటక
సంబంధిత కథనం
టాపిక్