ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ నేచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్.. పరకాయ ప్రవేశంతో కుర్రాళ్లకు కష్టాలు.. 7.6 ఐఎండీబీ రేటింగ్-padakkalam ott release date now digital streaming on jiohotstar available in telugu also ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ నేచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్.. పరకాయ ప్రవేశంతో కుర్రాళ్లకు కష్టాలు.. 7.6 ఐఎండీబీ రేటింగ్

ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ నేచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్.. పరకాయ ప్రవేశంతో కుర్రాళ్లకు కష్టాలు.. 7.6 ఐఎండీబీ రేటింగ్

తన పవర్స్ తో నలుగురు కాలేజీ కుర్రాళ్లను ఆటాడించే ఓ ఫ్రొఫెసర్ కథతో సూపర్ నేచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన మలయాళ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. క్యాంపస్ కామెడీతోనూ ఈ మూవీ అలరిస్తోంది.

ఓటీటీలోకి మలయాళం సూపర్ నేచురల్ మూవీ (x/JioHotstarMal)

మలయాళ సినిమాలంటే ఓటీటీలో ఉండే క్రేజే వేరు. తెలుగులోనూ ఆ మూవీస్ రిలీజ్ అవుతుండటంతో తెలుగు ఆడియన్స్ కూడా మలయాళ చిత్రాలపై మనసు పారేసుకుంటున్నారు. డిఫరెంట్ స్టోరీ లైన్ తో పాటు విభిన్న జోనర్లలో మల్లువుడ్ నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ మూవీనే ‘పడక్కలమ్’. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొట్టేందుకు వచ్చేసింది.

ఆ ఓటీటీలోకి

సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ పడక్కలమ్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (జూన్ 10) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి ఈ మూవీ వచ్చేసింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం మన సినిమా లవర్స్ కు పండగే. ఈ మూవీకి 7.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

నెల రోజుల తర్వాత

పడక్కలమ్ మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. మే 8, 2025 న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. స్టోరీ లైన్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కమర్షియల్ గానూ ఈ ఫిల్మ్ హిట్ అందుకుంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత మంగళవారం నుంచి ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

సూపర్ నేచురల్

సూపర్ నేచురల్ పవర్స్ తో ఓ కాలేజీ ప్రొఫెసర్ నలుగురు కాలేజీ కుర్రాళ్లను ఎలా ఆడుకున్నాడన్నది కామెడీగా తెరకెక్కించారు. కామిక్ బుక్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉండే నలుగురు కుర్రాళ్లు.. ప్రొఫెసర్ పవర్స్ తో ఇబ్బందుల్లో పడతారు. వాళ్ల లైఫ్ ఒక్కసారిగా అడ్వెంచరస్ గా మారిపోతుంది. డైస్ తో ప్రొఫెసర్ తన గేమ్ కొనసాగిస్తాడు. మరి ఆ ప్రొఫెసర్ కు పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నలుగురు కాలేజీ కుర్రాళ్లు దాన్ని ఎలా కనిపెట్టారు? అన్నది ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

పరకాయ ప్రవేశం

నలుగురు కుర్రాళ్ల క్యాంపస్ జీవితంలోకి అనుకోని సమస్య వచ్చి పడుతుంది. ప్రొఫెసర్ పవర్స్ కారణంగా ఒకరి శరీరంలోని నుంచి మరొకరి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసే క్యారెక్టర్లతో కామెడీ జెనరేట్ అవుతుంది. అప్పుడు ఎదురైన పరిస్థితులను చాలా ఫన్నీగా చూపించారు. కాలేజ్ క్యాంపస్ లైఫ్, కామెడీ, పరకాయ ప్రవేశం, కాస్త థ్రిల్.. ఇలాంటి ఎలిమెంట్స్ కావాలనుకునే మూవీ లవర్స్ కు పడక్కలమ్ పండగ లాంటి సినిమా.

మను స్వరాజ్ డైరెక్ట్ చేసిన పడక్కలమ్ మూవీలో సందీప్ ప్రదీప్, సూరజ్ వెంజారమూడు, షరఫుద్దీన్ తదితరులు లీడ్ రోల్స్ ప్లే చేశారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం