OTT Web Series Sequels: 2025లో రానున్న 6 మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ సీక్వెల్స్ ఇవే.. ఉత్కంఠతో ఊపేసేలా!
OTT Web Series Sequels 2025: కొన్ని వెబ్ సిరీస్‍ల సీక్వెల్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాటిలో కొన్ని పాపులర్ సిరీస్‍లు సీక్వెల్స్ 2025లో అడుగుపెట్టనున్నాయి. వాటిలో 6 మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ ఏవో ఇక్కడ చూడండి.
ఓటీటీల్లో వెబ్ సిరీస్‍లకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని థ్రిల్లర్ సిరీస్‍లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి సిరీస్‍లకు తదుపరి సీజన్లు ఎప్పుడు వస్తాయా ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. క్లైమాక్స్‌లో ట్విస్టుతోనో.. థ్రిల్లింగ్ అంశంతోనో సీక్వెల్‍పై హైప్ ఉండేలా మేకర్స్ చూస్తుంటారు. ఇలాంటి సిరీస్‍లకు సీక్వెల్స్ కోసం చాలా మంది నిరీక్షిస్తుంటారు. 2025లో కొన్ని పాపులర్ వెబ్ సిరీస్‍లకు సీక్వెల్స్ అడుగుపెట్టనున్నాయి. కొత్త సీజన్లు అడుగుపెట్టనున్నాయి. ఈ సీక్వెల్స్ కూడా ఉత్కంఠతో ఊపేస్తాయనే అంచనాలు ఉన్నాయి. అలా 2025లో రానున్న ఆరు వెబ్ సిరీస్ సీక్వెల్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
పాతాళ్‍లోక్ 2
2020లో వచ్చిన పాతాళ్‍లోక్ తొలి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మంచి సక్సెస్ అయింది. ఎంతగానో ఎదురుచూసిన ఈ సిరీస్‍కు రెండో సీజన్ సుమారు నాలుగున్నరేళ్ల తర్వాత వస్తోంది. పాతాళ్‍లోక్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2025 జనవరి 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇటీవలే ఆ ప్లాట్‍ఫామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. పాతాళ్‍లోక్ 2లో జైదీప్ అల్హవత్ ప్రధాన పాత్ర పోషించగా.. అవినాశ్ అరుణ్ ధవారే దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ 3
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా 2025లో రానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లో తొలి రెండు సీజన్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో భారీ వ్యూస్ సాధించాయి. ఈ సిరీస్‍లో మనోజ్ బాజ్‍పేయ్ లీడ్ రోల్ చేస్తున్నారు. రాజ్ & డీకే డైరెక్టర్లుగా ఉన్నాయి. మూడో సీజన్ కోసం మూడేళ్లుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు 2025లో ఫ్యామిలీ మ్యాన్ 3 రానుంది. ఈ సీజన్ షూటింగ్ పూర్తయిందని మనోజ్ రీసెంట్‍గా అప్‍డేట్ ఇచ్చారు.
ది ట్రయల్ సీజన్ 2
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న లీగల్ ఫ్యామిలీ డ్రామా ది ట్రయల్ వెబ్ సిరీస్‍లో రెండో సీజన్ 2025లో రానుంది. గతేడాది డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తొలి సీజన్ వచ్చి విజయవంతం అయింది. దీంతో రెండో సీజన్‍పై హైప్ ఎక్కువగా ఉంది. ఈ సిరీస్‍లో రెండో సీజన్‍కు ఉమేశ్ బిస్త్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఢిల్లీ క్రైమ్స్ సీజన్ 3
ఢిల్లీ క్రైమ్స్ మూడో సీజన్ 2025లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు సక్సెస్ అయ్యాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు రిచీ మెహతా, తనూజ్ చోప్రా దర్శకులుగా ఉన్నారు. ఢిల్లీ క్రైమ్స్ మూడో సీజన్‍లో షెఫాలీ షా, రసిక దుగ్గల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. మానవ అక్రమ రవాణాపై మూడో సీజన్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి
సుడల్ 2
తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్: ది వర్టెక్స్ ట్విస్టులు, థ్రిల్లింగ్ స్క్రీన్‍ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ తొలి సీజన్ భారీ వ్యూస్ దక్కించుకొని పాపులర్ అయింది. కాతిర్, ఐశ్వర్య రాజేశ్, పార్థిబన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‍కు పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించారు. సుడల్ రెండో సీజన్ 2025లో వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
లాస్ట్ ఆఫ్ అజ్ 2
అమెరికన్ థ్రిల్లర్ సిరీస్ ‘లాస్ట్ ఆఫ్ అజ్’ 2023లో వచ్చి చాలా పాపులర్ అయింది. గేమ్ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యూస్ దక్కించుకుంది. ఈ సిరీస్‍లో పెడ్రో పాస్కల్, బెల్లా రామ్సే ప్రధాన పాత్రలు పోషించగా.. క్రెగ్ మాజిన్, నీల్ డర్క్ మెన్ క్రియేట్ చేశారు. లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్‍కు రెండో సీజన్ 2025లో రానుంది. హెచ్‍బీవోలో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం