ఈ వీకెండ్ ఈ 7 ఓటీటీల్లోకి వచ్చిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి.. రెండు తెలుగు సినిమాలు కూడా..-ott weekend watch these 8 movies and web series on 7 ott netflix prime video jiohotstar sun nxt zee 5 aha tamil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ వీకెండ్ ఈ 7 ఓటీటీల్లోకి వచ్చిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి.. రెండు తెలుగు సినిమాలు కూడా..

ఈ వీకెండ్ ఈ 7 ఓటీటీల్లోకి వచ్చిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి.. రెండు తెలుగు సినిమాలు కూడా..

Hari Prasad S HT Telugu

ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడటానికి చాలా సినిమాలు, వెబ్ సిరీసే అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ 8 మూవీస్, సిరీస్ ఏవో తెలుసుకోండి. వీటిలో రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ వీకెండ్ ఈ 7 ఓటీటీల్లోకి వచ్చిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి.. రెండు తెలుగు సినిమాలు కూడా..

ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ ప్లాన్ చేయండి. ముఖ్యంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చిన ఈ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతున్నాయి. వీటిలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన కంటెంట్ ఉంది.

మిరాయ్ - జియోహాట్‌స్టార్

శుక్రవారం (అక్టోబర్ 10) జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన మూవీ ఇది. తేజ సజ్జ లీడ్ రోల్లో నటించిన సినిమా. 'హను-మాన్' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ.. ఈ మిరాయ్ ద్వారా మరో ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ తో తిరిగి వచ్చాడు. పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని 'బ్లాక్ స్వోర్డ్' ఎలా దక్కించుకోవాలని చూస్తాడు.. ఒక అనాథ అయిన వేద ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే కథాంశంతో కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తీశాడు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించగా, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్, రితికా శరణ్ వంటి వారు కూడా ఉన్నారు.

వార్ 2 - నెట్‌ఫ్లిక్స్

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. గురువారమే (అక్టోబర్ 9) నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ దగ్గర విఫలమైనా.. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

కురుక్షేత్ర సీజన్ 1 - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకే వచ్చిన మరో యానిమేషన్ వెబ్ సిరీస్ కురుక్షేత్ర. మహాభారత యుద్ధ నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

బాంబ్ - ప్రైమ్ వీడియో, ఆహా తమిళం

తమిళ మూవీ బాంబ్ కూడా ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చింది. బాంబ్ సినిమా డిఫరెంజ్ జోనర్ లో తెరకెక్కింది. మ్యాజికల్ రియలిజమ్ జోనర్ లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అంటే మ్యాజికల్ ఎలిమెంట్స్ తో కూడిన రియల్ వరల్డ్ లో జరిగే స్టోరీ ఇది. ఇందులో ఏది ఫిక్షన్, ఏది రియల్ అని కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది.

సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ - జియోహాట్‌స్టార్

సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నైనా అనే అమ్మాయి హత్య, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే సిరీస్ ఇది.

త్రిబాణధారి బార్బరిక్ - ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్

ప్రముఖ నటుడు సత్యరాజ్ ఇందులో సైకియాట్రిస్ట్ శ్యామ్ పాత్ర పోషించాడు. అతని మనవరాలు నిధి కనిపించకుండా పోవడంతో, వృద్ధుడైన శ్యామ్ పోలీసుల సహాయం కోరతాడు. అయితే దర్యాప్తులో సరైన ఆధారాలు దొరకకపోవడంతో, శ్యామ్ స్వయంగా నిధిని వెతకడానికి బయలుదేరుతాడు. ఈ సినిమా ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

వేడువన్ - జీ5 ఓటీటీ

కన్నా రవి ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ వెబ్ సిరీస్ 'వేడువన్'. పావన్ ఈ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాసి, దర్శకత్వం వహించాడు. ఒక బయోపిక్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర పోషించే అవకాశం పొందిన ఒక నటుడి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో సంజీవ్ వెంకట్, శ్రవణిత శ్రీకాంత్, రమ్య రామకృష్ణ, రేఖా నాయర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

రాంబో - సన్ నెక్ట్స్ ఓటీటీ

హారర్ సినిమా 'డిమాంటే కాలనీ 2' తర్వాత అరుళ్‌నిధి నటించిన 'రాంబో' అనే స్పోర్ట్స్ డ్రామా.. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. బాక్సింగ్ రింగ్‌లో అరుళ్‌నిధి ఉన్న పోస్టర్‌లో 'అపజయం ఎరుగని' అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ చిత్రంలో తాన్య రవిచంద్రన్, అభిరామి వీటీవీ గణేష్ కూడా నటించారు. దర్శకుడు ముతయ్య ఈ స్క్రిప్ట్‌ను కూడా రాశారు. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వచ్చింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం