ఓటీటీలోకి ఈవారం కూడా వివిధ భాషల్లో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, జీ5, సన్ నెక్ట్స్, సోనీ లివ్, ఆహా తమిళంలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ ఉన్నాయి. వీటిని ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.
తెలుగు బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ బుధవారం (అక్టోబర్ 1) ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.40 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు నమోదు చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శివకార్తికేయన్ మదరాసి మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన సినిమానే. రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ప్రైమ్ వీడియోలో తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక శ్రీలీల, కిరీటి రెడ్డి లీడ్ రోల్స్ లో నటించిన జూనియర్ మూవీ కూడా ఈ వారం రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చింది. కాస్త ఆలస్యంగానైనా ప్రైమ్ వీడియో, ఆహా వీడియో ఓటీటీలు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చాయి. తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళం మూవీ మైనే ప్యార్ కియా కూడా ఈ వారమే ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఈ ఏడాది ఓనమ్ రిలీజ్ లలో ఇదీ ఒకటి. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
శ్రద్ధా శ్రీనాథ్ నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది గేమ్. ఈ తమిళ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
సన్ నెక్ట్స్ ఓటీటీలోకి సాహసం అనే మలయాళం సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. దీంతోపాటు గౌరీశంకర అనే మరో కన్నడ సినిమాను కూడా ఇదే ఓటీటీలో చూడొచ్చు. ఈ రెండు సినిమాలు కేవలం ఆయా భాషల్లోనే స్ట్రీమింగ్ కు వచ్చాయి.
అటు జీ5 ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా పేరు చెక్‌మేట్. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఏడాది తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.
సోనీ లివ్ ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వచ్చింది. దీని పేరు 13th. ఇదో హిందీ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఈ వీకెండ్ కు ఇది కూడా మంచి ఆప్షనే.
నాలై నమదే ఈ ఏడాది జులై 25న థియేటర్లలో రిలీజైన తమిళ పొలిటికల్ డ్రామా. ఈ సినిమా తాజాగా ఆహా తమిళం ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. వెంబ కతిరేసన్ డైరెక్ట్ చేశాడు.
సంబంధిత కథనం