OTT Weekend Watch: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు-ott weekend watch do not miss these movies and web series on netflix prime video aha video etv win zee5 jio cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Weekend Watch: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

OTT Weekend Watch: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu
Nov 14, 2024 01:59 PM IST

OTT Weekend Watch: ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్, జీ5, సోనీలివ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోకి ఇప్పటికే కొన్ని వచ్చేయగా.. మరికొన్ని శుక్ర, శనివారాల్లో రాబోతున్నాయి.

ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు
ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

OTT Weekend Watch: ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలి? కొత్తగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లో మిస్ కాకుండా చూడాల్సిన ఏంటి? తెలుగుతోపాటు హిందీ, మలయాళం, ఇంగ్లిష్ భాషలకు సంబంధించిన ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీ వీకెండ్ వాచ్

మా నాన్న సూపర్ హీరో - ప్రైమ్ వీడియో, జీ5

సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అటు శుక్రవారం (నవంబర్ 15) నుంచి జీ5 ఓటీటీలోకి కూడా అడుగుపెట్టనుంది. దీంతో ఈ వీకెండ్ రెండు ఓటీటీల్లోకి అందుబాటులోకి రానుంది.

రేవు-ఆహా వీడియో

థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఆహా వీడియోలో గురువారం (నవంబర్ 14) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు రివేంజ్ థ్రిల్లర్ మూవీ రేవు. కొందరు మత్స్యకారుల చుట్టూ తిరిగే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది.

ఉషా పరిణయం - ఈటీవీ విన్

ఈటీవీ విన్ ఓటీటీలోకి ఈ వారం వచ్చిన మూవీ ఉషా పరిణయం. ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో అతని తనయుడు శ్రీ కమల్ హీరోగా నటించాడు. థియేటర్లలో రిలీజైన మూడున్నర నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. గురువారం (నవంబర్ 14) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

పైఠనీ - జీ5 ఓటీటీ

జీ5 ఓటీటీలోకి శుక్రవారం (నవంబర్ 15) వస్తున్న మూవీ పైఠనీ (Paithani). ఇదో హిందీ సినిమా. మగ్గంపై చీరలు నేసే తన తల్లి వారసత్వాన్ని కొనసాగించడానికి ఓ కూతురు సాగించే పోరాటమే ఈ పైఠనీ మూవీ.

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ - సోనీలివ్

సోనీలివ్ ఓటీటీలోకి శుక్రవారం (నవంబర్ 15) సరికొత్త వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అడుగుపెడుతోంది. దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో మీకు తెలియని స్టోరీ.. తెలుసుకోవాల్సిన స్టోరీ అంటూ వస్తున్న ఈ సిరీస్ ఆసక్తి రేపుతోంది. హిందీతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

అన్‌స్టాపబుల్ అల్లు అర్జున్ ఎపిసోడ్ - ఆహా వీడియో

అన్‌స్టాపబుల్ సీజన్ 4లో భాగంగా ఈ శుక్రవారం (నవంబర్ 15) ఓ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బాలకృష్ణ జరిపిన సంభాషణ ఈ షోలో చూడొచ్చు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది.

డెడ్‌పూల్ అండ్ వోల్వొరైన్ - హాట్‌స్టార్

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వొరైన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగులోనూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

ఏఆర్ఎం - హాట్‌స్టార్

మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ, టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం (అజయంతే రండమ్ మోషనమ్) మూవీ ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాను హాట్‌స్టార్ లో తెలుగులోనూ చూడొచ్చు.

ది వాచర్స్ - జియో సినిమా

హారర్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ఈ ది వాచర్స్ మూవీ చూడొచ్చు. ఈ హాలీవుడ్ సినిమా జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ అడవిలో వెళ్తూ అక్కడి ఓ బంకర్ లో చిక్కుకుపోయిన కొందరు వ్యక్తుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

Whats_app_banner