OTT Weekend Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. టైమ్ సరిపోదేమో..
OTT Weekend Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ చాలానే ఉన్నాయి. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, కొరియన్ భాషల్లో టైమ్ కూడా సరిపోనంత కంటెంట్ రెడీగా ఉంది.
OTT Weekend Releases: వీకెండ్ ఏదైనా ఓటీటీల్లో కంటెంట్ కు కొదవే ఉండదు. ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఆహా వీడియో, ఈటీవీ విన్, సోనీలివ్, జీ5లాంటి ఓటీటీల్లో ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. శని, ఆదివారాలు చూసినా టైమ్ సరిపోనంత కంటెంట్ కొత్తగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చి చేరింది.
ఓటీటీ వీకెండ్ రిలీజెస్
ఐ హేట్ లవ్ - ఈటీవీ విన్
ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఐ హేట్ లవ్. ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం (నవంబర్ 21) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పల్లెటూరి ప్రేమ, ద్రోహం, ఆత్మగౌరవం మధ్య నడిచే కథ అంటూ ఈ సినిమాను ఆ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
రేపటి వెలుగు - ఈటీవీ విన్
రేపటి వెలుగు కూడా ఈటీవీ విన్ ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు సినిమా. గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అందమైన ఆశలు, కొత్త ఆశయాలతో నిండిన పల్లెటూరి కథ అంటూ ఈ సినిమాను ఈటీవీ విన్ స్ట్రీమింగ్ చేస్తోంది.
ది రానా దగ్గుబాటి షో - ప్రైమ్ వీడియో
తెలుగులో కొత్తగా వస్తున్న డిఫరెంట్ సెలబ్రిటీ టాక్ షో ది రానా దగ్గుబాటి షో. శనివారం (నవంబర్ 23) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఈ రానా టాక్ షోలో తమ ముచ్చట్లతోపాటు వివిధ గేమ్స్ తోనూ అలరించనున్నారు.
నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ - నెట్‌ఫ్లిక్స్
నయనతార పెళ్లి, ఆమె అంతకుముందు జీవిత విశేషాలపై రూపొందించిన డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్. నెట్‌ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది.
జాంబీవెర్స్ సీజన్ 2 - నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ లోకి రెండో సీజన్ తో వచ్చేసింది కొరియన్ హారర్ వెబ్ సిరీస్ జాంబీవర్స్. తొలి సీజన్ సక్సెస్ కావడంతో ఈ కొత్త సీజన్ పై ఆసక్తి నెలకొంది. మంగళవారం (నవంబర్ 19) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
కిష్కింధ కాండం - హాట్‌స్టార్
మలయాళ థ్రిల్లర్ మూవీ కిష్కింధ కాండం. మంగళవారం (నవంబర్ 19) నుంచి హాట్‌స్టార్ లో తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఏలియన్: రొములస్ - హాట్‌స్టార్
ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏలియన్: రొములస్ గురువారం (నవంబర్ 21) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీల్లోనూ అందుబాటులో ఉంది.
డ్యూన్: ప్రాఫెసీ - జియో సినిమా
డ్యూన్: ప్రాఫెసీ అనే కొత్త వెబ్ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ రానుంది. టబు నటించిన ఈ వెబ్ సిరీస్ ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహా వీడియో - లగ్గం, మార్టిన్
ఆహా వీడియో ఓటీటీలో ఈ వారం రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తెలుగు మూవీ లగ్గం కాగా.. మరొకటి కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్టిన్. ఈ సినిమా కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు మూవీస్ తోపాటు అల్లు అర్జున్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే రెండో పార్ట్ కూడా శుక్రవారం (నవంబర్ 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బఘీర - నెట్‌ఫ్లిక్స్
కన్నడ సూపర్ హీరో మూవీ బఘీర గురువారం (నవంబర్ 21) నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. శ్రీమురళి నటించిన ఈ సినిమాను కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ చూడొచ్చు.