OTT Web Series: ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న నాలుగు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు
OTT Web Series This week: ఈ వారం ఓటీటీల్లోకి కొన్ని వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. అందులో నాలుగు సిరీస్‍లు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. విమానం హైజాక్ గురించి ఓ సిరీస్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్, ఫ్యాంటసీ సిరీస్‍లు కూడా రానున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో వెబ్ సిరీస్‍లు చూడాలని అనుకుంటున్నారా? ఈ వారం కూడా వివిధ ఓటీటీల్లో కొన్ని నయా వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. కాందహార్ హైజాక్ ఘటనపై రూపొందిన సిరీస్ ఈవారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా అడుగుపెట్టనుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లైనప్‍లో రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి రానున్న 4 కీలకమైన సిరీస్‍లు ఇవే.
ఐసీ 814: ది కాందహార్ హైజాక్
ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ ఈ వారమే ఆగస్టు 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. విజయ్ వర్మ, నజీరుద్దీన్ షా, దియా మీర్జా, పంకజ్ కపూర్, కుముద్ మిశ్రా ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన యథార్థ ఘటన ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది.
‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ సిరీస్‍కు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. హిందీలో రూపొందిన ఈ సిరీస్ ఆగస్టు 29న తెలుగుతో పాటు మరిన్ని భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీజర్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ సిరీస్‌పై చాలా ఆసక్తి ఉంది.
ముర్షిద్
ముర్షిద్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 30వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లో కేకే మీనన్, తనూజ్ విర్వానీ, జాకీర్ హుసేన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సిరీస్‍కు శ్రవణ్ తివారీ దర్శకత్వం వహించారు. ముంబై అండర్ వరల్డ్ సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం జరిగే పోరు చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఆగస్టు 30 నుంచి జీ5లో ముర్షిద్ వెబ్ సిరీస్ చూడొచ్చు.
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2
ఎంతో మంది ఎదురుచూస్తున్న ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 కూడా ఈ వారమే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ సీజన్ ఆగస్టు 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ ఫ్యాంటసీ సిరీస్‍కు జేడీ పైన్, పాట్రిక్ మెక్‍కే షోరన్నర్లుగా ఉన్నారు. 2022లో వచ్చిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 1 సక్సెస్ అయింది. ఇప్పుడు సుమారు రెండేళ్ల తర్వాత సీజన్ 2 వస్తోంది. ఈ సిరీస్‍లో సింతియా అడై రాబిన్‍సన్, రాబర్ట్ అరామయో, ఓవైన్ ఆర్థర్, మ్యాక్సిమ్ బాల్‍డ్రై, జిమ్ బ్రాడెంట్, గావీ సింగ్, మార్ఫిడ్ క్లార్క్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఇంగ్లిష్ సిరీస్ తెలుగు, హిందీ సహా మరిన్ని భారతీయ భాషల్లోనూ ఆగస్టు 29న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రానుంది.
క్యాడెట్స్
క్యాడెట్స్ వెబ్ సిరీస్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 30వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తనయ్ చద్దా, చయాన్ చోప్రా, తుషార్ షాహి, గౌతమ్ గుజ్జర్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. కాలేజీలో క్యాడెట్లుగా చేరిన నలుగురు సాధారణ యువకులు భారత ఆర్మీకి వెళ్లే జర్నీ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. క్యాడెట్స్ సిరీస్‍కు విశ్వజాయ్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.