OTT Web Series August: ఈనెల ఓటీటీల్లోకి వస్తున్న టాప్-5 వెబ్ సిరీస్‍లు ఇవే.. విభిన్న జానర్లలో..
OTT Top Web Series releases in August: ఓటీటీల్లోకి ఈనెల కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. విభిన్నమైన జానర్లలో వస్తున్నాయి. ఈ నెలలో ఓటీటీల్లోకి రానున్న టాప్-5 వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈనెల (ఆగస్టు) కొన్ని వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ముఖ్యమైన సిరీస్‍లు ఉన్నాయి. మలయాళ స్టార్ నటీనటులు కలిసి చేసిన మనోరతంగల్ వెబ్ సిరీస్ ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. ఎంతోకాలం నుంచి వేచిచూస్తున్న ఈ సిరీస్ అడుగుపెట్టనుంది. డిటెక్టివ్ సిరీస్ శేఖర్ హోమ్స్ సిరీస్ కూడా రానుంది. త్రిష బృంద సిరీస్ ఇప్పటికే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇలా.. ఈనెల ఓటీటీల్లో టాప్-5 వెబ్ సిరీస్‍లు ఇవే.
మనోరతంగల్
ఎంతో కాలం నుంచి వేచిచూస్తున్న మనోరతంగల్ ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ ఆంథాలజీ డ్రామా సిరీస్ ఆగస్టు 15వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. లోకనాయకుడు కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్‍లాల్, ఫాహద్ ఫాజిల్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. మరికొందరు ప్రముఖ నటులు కూడా ఉన్నారు. మనోరతంగల్ సిరీస్‍లో 9 కథలు ఉంటాయి. 8 మంది డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‍ను ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీలో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో చూడొచ్చు.
బృంద
స్టార్ హీరోయిన్ త్రిష చేసిన తొలి వెబ్ సిరీస్ ‘బృంద’ ఈనెల ఆగస్టు 2న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‍కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్‍లో త్రిషతో పాటు రవీంద్ర విజయ్‍తో పాటు ఇంద్రజిత్ సుకుమార్, జయ ప్రకాశ్, ఆమని, రాఖేందుమౌళి కీరోల్స్ చేశారు. బృంద సిరీస్‍కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. హత్యల వెనుక మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. బృంద సిరీస్‍ను జీ5లో చూసేయవచ్చు.
శేఖర్ హోమ్స్
డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్‍గా ‘శేఖర్ హోమ్స్’ వస్తోంది. ఈ సిరీస్ ఆగస్టు 14వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో కేకే మీనన్ ప్రధాన పాత్ర పోషించారు. పాపులర్ ఇంగ్లిష్ డిటెక్టివ్ సిరీస్ షెర్లాక్ హోమ్స్ స్ఫూర్తిగా ఈ సిరీస్ రూపొందుతోంది. శేఖర్ హోమ్స్ సిరీస్‍కు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
ఐసీ 814: ది కాందహార్ హైజాక్
ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ ఆగస్టు 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. పాకిస్థాన్‍కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఘటన ఆధారంగా ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‍లో విజయ్ వర్మ, నజీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, దియా మీర్జా, మనోజ్ పహ్వా, అరవింద స్వామి కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్‍ను ఆగస్టు 29 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.
గ్యారా గ్యారా
గ్యారా గ్యారా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 9వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో రాఘవ్ జుయల్, కృతిక కర్మ, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు పోషించారు. ఉమేశ్ బిస్త్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. పాపులర్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా ఈ సిరీస్ నిర్మాతల్లో ఒకరిగా ఉండడంతో మంచి హైప్ ఉంది.