OTT Valentine's Day Releases: ఈ వాలెంటైన్స్ డేకి ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా-ott valentines day releases marco sammelanam love under construction dhoom dhaam on netflix prime video hotstar etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Valentine's Day Releases: ఈ వాలెంటైన్స్ డేకి ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా

OTT Valentine's Day Releases: ఈ వాలెంటైన్స్ డేకి ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా

Hari Prasad S HT Telugu
Feb 04, 2025 03:09 PM IST

OTT Valentine's Day Releases: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికుల దినోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఓటీటీలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా రాబోతున్నాయి. మరి అవేంటి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.

ఈ వాలెంటైన్స్ డేకి ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా
ఈ వాలెంటైన్స్ డేకి ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా

OTT Valentine's Day Releases: వాలెంటైన్స్ డే స్పెషల్ మూవీస్, వెబ్ సిరీస్ కొన్ని ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఈటీవీ విన్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఇవి రానున్నాయి. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాలో ధూమ్ ధామ్, లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్, సమ్మేళనం, మార్కో, ప్యార్ టెస్టింగ్ లాంటివి ఉన్నాయి. మరి ఏ మూవీ, వెబ్ సిరీస్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఓటీటీ వాలెంటైన్స్ డే రిలీజెస్

వాలెంటైన్స్ డే కోసం ప్రతి ఏటా ప్రేమ పక్షులు ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వాళ్లు ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మార్కో - సోనీలివ్

మలయాళ యాక్షన్ థ్రిల్లర్, మోస్ట్ వయోలెంట్ మార్కో ఓటీటీలోకి వచ్చేస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వాలెంటైన్స్ డే వయోలెన్స్ డేగా మారనుందంటూ ఆ ఓటీటీ మార్కో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని కొన్ని రోజుల కిందట వెల్లడించింది. ఉన్ని ముకుందన్ నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

సమ్మేళనం - ఈటీవీ విన్

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈటీవీ విన్ సమ్మేళనం అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఫిబ్రవరి 13న ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే ఆ ఓటీటీ వెల్లడించింది. నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా గురించి పెద్దగా సమాచారం లేదు. అయితే పోస్టర్ చూస్తుంటే యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీగా కనిపిస్తోంది.

ధూమ్ ధామ్ - నెట్‌ఫ్లిక్స్

ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ధూమ్ ధామ్. ఫస్ట్ నైట్ రోజే ఓ డ్రగ్స్ రాకెట్ మాఫియా చేతికి చిక్కే ఓ జంట చుట్టూ తిరిగే స్టోరీ ఇది. క్రైమ్ థ్రిల్లర్ కు కామెడీని జోడించి వస్తున్న మూవీ ఇది. ఫిబ్రవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ప్యార్ టెస్టింగ్ - జీ5 ఓటీటీ

జీ5 ఓటీటీలోకి నేరుగా ప్యార్ టెస్టింగ్ అనే మూవీ కూడా వాలెంటైన్స్ డే రోజే వస్తోంది. పెద్దలు కుదర్చిన పెళ్లే అయినా.. తనకు నచ్చినట్లుగా జరగాలని అనుకునే ఈకాలం అమ్మాయి, అబ్బాయి చుట్టూ తిరిగే కథే ఈ ప్యార్ టెస్టింగ్. ఈ మూవీ ఫిబ్రవరి 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే ఓ టీజర్ ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ - హాట్‌స్టార్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ పేరుతో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. కమింగ్ సూన్ అంటూ ఈ మధ్యే హాట్‌స్టార్ చెప్పినా.. వాలెంటైన్స్ డే సందర్భంగానే ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజు వర్గీస్ నటించిన ఈ సిరీస్ మలయాళం, తెలుగుతోపాటు మరో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం