Malayalam OTT: ఓటీటీలోకి రానున్న నాలుగు మలయాళ థ్రిల్లర్ సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు-ott upcoming four malayalam thriller movies marco to rekhachithram zee5 to sony liv otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Ott: ఓటీటీలోకి రానున్న నాలుగు మలయాళ థ్రిల్లర్ సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు

Malayalam OTT: ఓటీటీలోకి రానున్న నాలుగు మలయాళ థ్రిల్లర్ సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2025 01:18 PM IST

OTT Malayalam Thrillers: త్వరలో ఓటీటీల్లోకి మరో నాలుగు మలయాళ చిత్రాలు రానున్నాయి. ఇందులో రెండు బ్లాక్‍బస్టర్ పాపులర్ చిత్రాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT Malayalam Thrillers: ఓటీటీలోకి రానున్న నాలుగు మలయాళ థ్రిల్లర్ సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు
OTT Malayalam Thrillers: ఓటీటీలోకి రానున్న నాలుగు మలయాళ థ్రిల్లర్ సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు

ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో మలయాళ చిత్రాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇతర భాషల ప్రేక్షకులు కూడా నయా మాలీవుడ్ సినిమాల కోసం కోసం చూస్తుంటారు. త్వరలో ఓటీటీల్లో నాలుగు పాపులర్ మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఈ నాలుగూ థ్రిల్లర్లే. ఇందులో రెండు భారీ హిట్‍లు కాగా.. రెండు ప్లాఫ్‍లు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఐడెంటిటీ

ఐడెంటిటీ మూవీ జనవరి 31వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టొవినో థామస్, త్రిష లీడ్ రోల్స్ చేశారు. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

ఐడెంటిటీ మూవీకి అఖిల్ పౌల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జనవరి 2న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. గత వారం తెలుగులోనూ వచ్చింది. ఈ చిత్రం ఓవరాల్‍గా సుమారు రూ.18కోట్ల కలెక్షన్లు తక్కించుకొని ప్లాఫ్‍గా నిలిచింది. థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఐడెంటిటీ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తోంది.

మార్కో

ఉన్నిముకుందన్ హీరోగా నటించిన ‘మార్కో’ చిత్రం సంచలన విజయం సాధించింది. మోస్ట్ వైలెంట్ మలయాళ చిత్రంగా పాపులర్ అయిన ఈ సినిమా రూ.120కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసి.. బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. డిసెంబర్ 20వ తేదీన మలయాళంలో రిలీజైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత రెండు వారాలకు తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. ఇక్కడా మంచి వసూళ్లే దక్కించుకుంది.

మార్కో చిత్రం త్వరలో ఫిబ్రవరి నెలలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడ్డాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ దక్కించుకుందనే సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్కో మూవీకి హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు.

రేఖాచిత్రం

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రేఖాచిత్రం’ బ్లాక్‍బస్టర్ సాధించింది. రూ.6 కోట్లతో ఈ చిత్రం రూపొందగా.. రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటి బ్లాక్‍బస్టర్ అయింది. మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించగా.. సీనియర్ స్టారో మమ్ముట్టి క్యామియో రోల్‍లో కనిపించారు.

రేఖాచిత్రం సినిమా ఆత్మహత్య కేసు చుట్టూ సాగుతుంది. దీనికి మరో క్రైమ్ లింక్ అయి ఉంటుంది. ఈ మూవీని దర్శకుడు జోఫిన్ టీ చాకో తెరకెక్కించారు. రేఖా చిత్రం కూడా ఫిబ్రవరిలో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. స్ట్రీమింగ్ తేదీపై త్వరలో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

రుధిరం

మలయాళ సైకలాజికల్ చిత్రం ‘రుధిరం’ డిసెంబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను రాబట్టలేక ప్లాఫ్‍గా నిలిచిపోయింది. ఈ మలయాళ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ రాజ్ బీ శెట్టి, అపర్ణ బాలమురళి లీడ్ రోల్స్ చేశారు. జిషో లాన్ ఆంటోనీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రుధిరం చిత్రం ఫిబ్రవరిలో ఓటీటీలో వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్‍ఫామ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు బయటికి రావాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం