OTT: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు.. పుష్ప 2 సహా మరో మూడు చిత్రాలు.. ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్-ott top releases this week pushpa 2 the secret of the shiledars identity and more hotstar netflix etv win and zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు.. పుష్ప 2 సహా మరో మూడు చిత్రాలు.. ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్

OTT: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు.. పుష్ప 2 సహా మరో మూడు చిత్రాలు.. ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 28, 2025 03:56 PM IST

Top OTT Releases This Week: ఈ వారంలో పుష్ప 2 సినిమా ఓటీటీలోకి అడుపెట్టనుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. త్రిష నటించిన ఓ మలయాళ మూవీ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఏవంటే..

Top OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు.. పుష్ప 2 సహా మరో మూడు చిత్రాలు.. ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్
Top OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు.. పుష్ప 2 సహా మరో మూడు చిత్రాలు.. ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్

జనవరి చివరి వారంలో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లో వివిధ ఓటీటీల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇందులో కొన్ని రిలీజ్‍లు ఆసక్తికరంగా ఉన్నాయి. అల్లు అర్జున్ భారీ బ్లాక్‍‍బస్టర్ మూవీ పుష్ప 2 ఇదే వారంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. శివాజీ మహారాజ్ నిధి బ్యాక్‍డ్రాప్‍లో ఓ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ తెలుగు యాక్షన్ మూవీ నేరుగా వచ్చేయనుంది. ఈ జనవరి లాస్ట్ వీక్ ఓటీటీల్లోకి రానున్న టాప్-5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ వారమే జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. గత నెల డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ మూవీ రూ.1,850 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు పైగా దక్కించుకుంది. ఈ క్రమంలో చాలా రికార్డులను తిరగరాసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం జనవరి 30న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీ వెర్షన్ ఆలస్యం కానుంది.

ఐడెంటిటీ

మలయాళ హీరో టొవినో థామస్, స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలు పోషించిన ఐడెంటిటీ మూవీ జనవరి 31వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మలయాళంలో జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు జనవరి 31 నుంచి ఐడెంటిటీ మూవీని జీ5 ఓటీటీలో చూడొచ్చు.

ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్

అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్’ ఈ శుక్రవారం జనవరి 31వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో సాయి తంహనకర్, రాజీవ్ ఖండేవాల్ లీడ్ రోల్స్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నిధి కోసం చేసే అన్వేషణ చుట్టూ సాగే ఈ సిరీస్‍కు ఆదిత్య సర్పోర్ట్‌దార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ సిరీస్‍పై మంచి ఆసక్తిని పెంచింది.

పోతుగడ్డ

పోతుగడ్డ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 30వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవి విన్‍లోకి ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో ఆడుకాలం నరేన్, శత్రు, ప్రశాంత్ కాంతి, పృథ్వి దండమూడి ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి రక్ష వీరమ్ దర్శకత్వం వహించారు.

కాఫీ విత్ ఏ కిల్లర్

కాఫీ విత్ ఏ కిల్లర్ చిత్రం జనవరి 31వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైెరెక్టర్ ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో రిలీజైన సుమారు రెండేళ్ల తర్వాత ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీలో రవిబాబు, శ్రీనివాసరెడ్డి, శ్రీ రాపాక, రఘుబాబు కీలకపాత్రలు పోషించారు.

Whats_app_banner

సంబంధిత కథనం