గత వారం ఓటీటీల్లో కోర్ట్, ఛావా, ప్రావింకూడు షప్పు, ఛోరీ 2 సహా మరిన్ని పాపులర్ చిత్రాలు అడుగుపెట్టాయి. ఈ ఏప్రిల్ మూడో వారంలోనూ (ఏప్రిల్ 14 - 19) కొన్ని సినిమాలు, సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. కానీ గతవారంతో పోలిస్తే తక్కువ రిలీజ్‍లే ఉన్నాయి. కానీ ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే వాటిలో ఐదు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. వివిధ జానర్లలో చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే..
హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఖౌఫ్’ ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో మోనికా పవర్, చమ్ దరంగ్, అభిషేక్ కపూర్, రతజ్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే వచ్చిన కౌఫ్ ట్రైలర్ భయపెట్టేలా ఇంటెన్స్ హారర్ ఎలిమెంట్లతో ఉంది. దీంతో ఈ సిరీస్‍పై ఆసక్తి పెరిగింది. ఈ హారర్ సిరీస్‍కు స్మితా సింగ్ షోరన్నర్‌గా ఉన్న ఈ సిరీస్‍కు పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 18 నుంచి ప్రైమ్ వీడియో ఖౌఫ్ సిరీస్‍ను చూడొచ్చు.
పాపులర్ వెబ్ సిరీస్ లాస్ట్ ఆఫ్ అజ్‍కు రెండో సీజన్ వచ్చేసింది. ఈ సిరీస్ రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఈ సోమవారం (ఏప్రిల్ 14) జియోహాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. మే 26వ తేదీ వరకు ప్రతీ సోమవారం ఓ ఎపిసోడ్ హాట్‍స్టార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్‍లో పెడ్రో కాస్టెల్, బెల్లా రామ్సే లీడ్ రోల్స్ చేశారు. లాస్ట్ ఆఫ్ అజ్ సిరీస్‍కు క్రెగ్ మాజిన్, నీల్ డ్రక్‍మ్యాన్ క్రియేటర్లుగా ఉన్నారు.
సైబర్ థ్రిల్లర్ సినిమా ‘లాగ్‍ఔట్’ జీ5 ఓటీటీలో ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. లాగ్‍ఔట్ సినిమాకు అమిత్ గోలానీ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 18 నుంచి జీ5లో ఈ హిందీ చిత్రాన్ని చూడొచ్చు.
బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా మేరే హస్బెండ్ కీ బీవీ.. ఏప్రిల్ 18వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ చేశారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. మేరే హస్బెండ్ కీ బీవీ సినిమాకు ముదాసర్ అజీజ్ దర్శకత్వం వహించారు. రూ.60కోట్ల బడ్జెట్ ఖర్చైన ఈ చిత్రం రూ.15కోట్ల కలెక్షన్లు కూడా దక్కించుకోలేకపోయింది.
మలయాళ యాక్షన్ సినిమా దావీద్.. ఏప్రిల్ 18వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆంటోనీ వర్గీస్, లిజోమోల్ జోస్, మో ఇస్మాయిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోవింద్ విష్ణు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 18న జీ5 ఓటీటీలోకి దావీద్ చిత్రం అడుగుపెట్టనుంది.
సంబంధిత కథనం
టాపిక్