OTT December Top Release: డిసెంబర్‌లో ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు.. న్యూఇయర్‌ నైట్‍కు..-ott top movies web series releases in december amaran to squid game 2 bhool bhool bhulaiyaa 2 netflix amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott December Top Release: డిసెంబర్‌లో ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు.. న్యూఇయర్‌ నైట్‍కు..

OTT December Top Release: డిసెంబర్‌లో ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు.. న్యూఇయర్‌ నైట్‍కు..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 31, 2024 11:55 AM IST

OTT Top Movies December: డిసెంబర్‌లో చాలా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ ఉంటే.. మరికొన్ని డిజాస్టర్లు కూడా అడుగుపెట్టాయి. ఓ పాపులర్ సిరీస్ రెండో సీజన్ కూడా వచ్చింది. ఈనెలలో ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఏవంటే..

OTT Top Movies December: డిసెంబర్‌లో ఓటీటీలో టాప్ 7 రిలీజ్‍లు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు.. న్యూఇయర్‌ నైట్‍కు..
OTT Top Movies December: డిసెంబర్‌లో ఓటీటీలో టాప్ 7 రిలీజ్‍లు.. బ్లాక్‍బస్టర్లు, డిజాస్టర్లు.. న్యూఇయర్‌ నైట్‍కు..

ఈ ఏడాది 2024 చివరి నెల డిసెంబర్‌లో మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఎంట్రీ ఇచ్చాయి. వివిధ జానర్లు, సబ్జెక్టులతో అడుగుపెట్టాయి. థియేటర్లలో రిలీజైన కొన్ని బ్లాక్‍బస్టర్లతో పాటు డిజాస్టర్లు కూడా ఈనెలలో ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‍కు వచ్చాయి. డిసెంబర్ నెలలో ఓటీటీల్లో టాప్-7 రిలీజ్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి. చూడాలనుకున్నవి ఏవైనా మిస్ అయి ఉంటే నేడు డిసెంబర్ 31న న్యూఇయర్ నైట్‍కు ప్లాన్ చేసుకోండి!

yearly horoscope entry point

అమరన్

శివ కార్తికేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన అమరన్ చిత్రం డిసెంబర్ 5వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజైన అమరన్ బ్లాక్‍బస్టర్ అయింది. సుమారు రూ.335కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. అమర జవాన్ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత ఆధారంగా అమరన్ చిత్రాన్ని దర్శకుడు రాజ్‍కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఒకవేళ అమరన్ మూవీ మిస్ అయి ఉంటే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.

జీబ్రా

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన జీబ్రా సినిమా డిసెంబర్ 20వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన జీబ్రా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డాలీ ధనుంజయ, సత్యరాజ్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ తెలుగు థ్రిల్లర్ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. జీబ్రా మూవీని ఆహాలో చూసేయండి.

కంగువ

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ చిత్రం డిసెంబర్ 8వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ డిజాస్టర్ అయింది. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. కంగువ చిత్రం ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

సింగం అగైన్

బాలీవుడ్ యాక్షన్ మూవీ సింగం అగైన్ చిత్రం డిసెంబర్ 27వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హిందీ మూవీలో అజయ్ దేవ్‍గణ్, రణ్‍వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దీపికా పదుకొణ్, టైగర్ ష్రాఫ్‍, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. రోహిత్ శెట్టి ఈ హ్యూజ్ మల్టీస్టారర్ మూవీకి దర్శకత్వం వహించారు. నవంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మోస్తరు వసూళ్లను సాధించింది.

భూల్ భులయ్యా 3

భూల్ భులయ్యా 3 చిత్రం డిసెంబర్ 27వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ మూవీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. రూ.400కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీని ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

జిగ్రా

స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డిసెంబర్ 6న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజ్ కాగా.. భారీ ఫ్లాఫ్ అయింది.

విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో

రాజ్‍కుమార్ రావ్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ థ్రిల్లర్ చిత్రం విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో.. డిసెంబర్ 7న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ హిందీ చిత్రం అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చి మోస్తరు వసూళ్లను దక్కించుకుంది.

స్క్విడ్ గేమ్ 2

మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’కు రెండో సీజన్ డిసెంబర్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మూడేళ్ల క్రితం తొలి సీజన్ ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ కాగా.. రెండో సీజన్ కూడా దుమ్మురేపుతోంది. స్క్విడ్ గేమ్ 2 సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కొరియన్, ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం