OTT: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న 4 టాప్ చిత్రాలు.. యాక్షన్, క్రైమ్ కామెడీ, రొమాంటిక్ జానర్లలో..
OTT Top Movies This Week: ఈ వారం నాలుగు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. అందరూ ఎంతో ఎదురుచూస్తున్న బ్లాక్‍బస్టర్ యాక్షన్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. నిత్యామీనన్ నటించిన ఓ మూవీ కూడా అడుగుపెట్టనుంది.

వాలెంటైన్స్ వీక్ నడుస్తున్న ఈ వారంలో ఓటీటీల్లోకి వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 10 - 15) మరికొన్ని సినిమాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఓ నాలుగు చిత్రాలపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. అందులో బ్లాక్‍బస్టర్ చిత్రం మార్కో కూడా ఒకటి. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. స్టార్ హీరోయిన్ నిత్యా మేనన్ నటించిన ఓ రొమాంటిక్ కామెడీ చిత్రం కూడా అడుగుపెట్టనుంది. మరో రెండు హిందీ మూవీస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానున్న వాటిలో 4 టాప్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
మార్కో
మార్కో చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మలయాళ మూవీ మార్కో గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత తెలుగులోనూ విడుదలైంది. రూ.100కోట్లకుపైగా కలెక్షన్లతో మార్కో బ్లాక్‍బస్టర్ కొట్టింది. డైరెక్టర్ హనీఫ్ అదేనీ తెరకెక్కించిన ఈ మూవీకి మోస్ట్ వైలెంట్ చిత్రమనే పేరొచ్చింది. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీ అయిన మార్కో.. వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న సోనీ లివ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
కాదలిక్క నేరమిళ్లై
రవి మోహన్ (జయం రవి), నిత్యా మేనన్ హీరోహీరోయిన్లుగా నటించిన కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ తమిళ చిత్రం తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది. కృతుంగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఈ ఏడాది జనవరి 14న థియేటర్లలో రిలీజైంది. కాదలిక్క నేరమిళ్లై మూవీకి మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.
ధూమ్ ధామ్
ధూమ్ ధామ్ చిత్రం నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా ఫిబ్రవరి 14న ఈ క్రైమ్ కామెడీ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్, యంగ్ యాక్టర్ ప్రతీక్ గాంధీ.. ప్రధాన పాత్రలు పోషించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ హిందీ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఇటీవల వచ్చిన ధూమ్ ధామ్ టీజర్ ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది.
బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ
బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ మూవీ ఫిబ్రవరి 11న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం కూడా నేరుగానే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ మూవీలో వర్ధన్ పూరి, కావేరి కపూర్ లీడ్ రోల్స్ చేశారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు డైరెక్టర్ కునాల్ కోహ్లీ. అనుకోకుండా పరిచయమైన ఇద్దరు ప్రేమలో పడడం, వారి మధ్య ఎడబాటు రావటం చుట్టూ బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ మూవీ సాగుతుంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ డాకు మహారాజ్ ఈ వారమే ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుందనే రూమర్లు ఉన్నాయి. అయితే, అధికారిక ప్రకటన రాలేదు.
సంబంధిత కథనం