OTT Telugu Movies: న్యూఇయర్‌కు సరదాగా తెలుగు ఎవర్‌గ్రీన్ సినిమాలు చూడాలనుకుంటున్నారా? ఓటీటీల్లో 10 బెస్ట్ ఆప్షన్లు
OTT Evergreen Telugu movies: ప్రత్యేకమైన సందర్భాల్లో ఫ్యామిలీ, స్నేహితులతో ఎవర్‌గ్రీన్ సినిమాలు చూడాలని చాలా మంది అనుకుంటారు. సరదా సినిమాలను ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ న్యూఇయర్ కోసం కూడా ఆలోచిస్తుంటే.. ఈ పది చిత్రాలు బెస్ట్ ఆప్షన్స్. అవేవంటే..
కొన్ని సినిమాలను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి ఎవర్‌గ్రీన్ చిత్రాలను మళ్లీమళ్లీ చూడాలని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా ఏదైనా స్పెషల్ రోజు అయితే ఫ్యామిలీతోనో.. స్నేహితులతోనే కలిసి అలాంటి క్లాసిక్ ఎవర్‌గ్రీన్ సినిమాలను చూసేందుకు ఇష్టపడతారు. టాలీవుడ్‍లో ఇలాంటి చిత్రాలు బోలెడు ఉన్నాయి. ఈ 2025 న్యూఇయర్ రోజున కూడా అలాంటి తెలుగు చిత్రాలు చూడాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇందుకోసం కొన్ని సినిమాలు బాగా సూటవుతాయి. ఈ న్యూఇయర్ రోజున ఓటీటీల్లో చూసేందుకు 10 తెలుగు ఎవర్‌గ్రీన్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
నువ్వు నాకు నచ్చావ్
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ (2001) సినిమాలో కామెడీ, పంచ్‍లు, లవ్ స్టోరీ ఇలా అన్ని విషయాలు ప్రేక్షకులకు తెగనచ్చేస్తాయి. ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా చాలా మందికి బోరు కొట్టదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించగా.. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఎవర్‌గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా డిస్నీ+హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉంది. యూట్యూబ్‍లో కూడా ఉచితంగా చూసేయవచ్చు.
అదుర్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యుయల్ రోల్స్ చేసిన అదుర్స్ (2010) మూవీ కూడా కామెడీలో ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఎన్నిసార్లు చూసిన పెద్దగా బోర్ అనిపించదు. అదుర్స్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉంది. ఈ న్యూయర్ రోజున సరదాగా చూసేందుకు ఇది కూడా ఓ మంచి ఆప్షన్.
ఓయ్
ఓయ్ (2009) చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ కాకపోయినా ఆ తర్వాత క్లాసిక్‍గా పేరుతెచ్చుకుంది. సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ.. ఫీల్ గుడ్ లవ్‍స్టోరీ, కామెడీతో ఆకట్టుకుంటుంది. ఓయ్ చిత్రం సన్‍నెక్స్ట్ ఓటీటీతో పాటు యూట్యూబ్‍లోనూ అందుబాటులో ఉంది.
జై చిరంజీవ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ (2005) బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ కాకపోయినా.. కామెడీ విషయంలో ఎవర్‌గ్రీన్‍గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్ హైలైట్. ఈ చిత్రంలో కామెడీ, ఎమోషనల్ బాగుంటుంది. ఈ సినిమాను యూట్యూబ్‍లో చూడొచ్చు.
అతడు, ఖలేజా
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోగా నటించిన అతడు (2005) చిత్రం కూడా క్లాసిక్‍గా నిలిచింది. పంచ్‍లు, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ ఇలా ఈ చిత్రంలో చాలా విషయాలు ఆకట్టుంటాయి. అతడు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు యూట్యూబ్‍లోనూ స్ట్రీమింగ్‍కు ఉంది. మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఖలేజా (2010) కూడా కామెడీ విషయంలో ఎన్నిసార్లు చూసినా అలరిస్తుంది. ఈ చిత్రాన్ని సన్‍నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్‍లో చూడొచ్చు.
మనం
నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రీయా ప్రధాన పాత్రలు పోషించిన మనం (2014) చిత్రం కూడా ఓ క్లాసిక్కే. విక్రమ్ కే కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేయవచ్చు. సరదాగా సాగుతూనే ఎమోషనల్‍గా ఈ మూవీ టచ్ చేస్తుంది. మనం చిత్రాన్ని సన్‍నెక్స్ట్ , యూట్యూబ్ ప్లాట్‍ఫామ్‍ల్లో చూడొచ్చు.
మల్లీశ్వరి
మల్లీశ్వరి (2004) చిత్రంలో కామెడీ కూడా ఎవర్‌గ్రీన్‍గా నిలిచింది. విక్టరీ వెంకటేశ్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ఇచ్చారు. ఈ చిత్రంలోనూ పంచ్‍లు, కామెడీ ఏ రేంజ్‍లో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ, యూట్యూబ్‍లో మల్లీశ్వరి చిత్రం అందుబాటులో ఉంది.
మన్మధుడు
కింగ్ నాగార్జున హీరోగా నటించిన మన్ముధుడు (2002) కూడా ఓ క్లాసిక్‍గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, కామెడీ ఈ మూవీకి హైలైట్‍గా నిలిచాయి. ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మన్ముధుడు సినిమాను హాట్‍స్టార్, యూట్యూబ్‍ల్లో చూసేయవచ్చు.
ఈనగరానికి ఏమైంది
న్యూఇయర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి చూసేందుకు ఈ నగరానికి ఏమైంది (2018) చిత్రం సరిగ్గా సూటవుతుంది. కామెడీ, ఫ్రెండ్స్ మధ్య బాండ్‍తో సాగే ఈ మూవీ బడ్డీ కామెడీ చిత్రాల్లో ఓ క్లాసిక్‍గా చెప్పొచ్చు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్‍సేన్, సాయి సుదర్శన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను లీడ్ రోల్స్ చేశారు. ఈ నగరానికి ఏమైంది చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఖుషి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఖుషి (2000) చిత్రం కూడా ఓ ఎవర్‌గ్రీన్ మూవీనే. ఈ చిత్రంలో లవ్ స్టోరీ, పవన్ మేనజిజమ్స్, నటన, భూమిక యాక్టింగ్ సూపర్ అనిపిస్తాయి. ఎస్‍జే సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికీ ఫ్రెష్‍గానే అనిపిస్తుంది. న్యూఇయర్ రోజు సరదాగా చూసేందుకు సూటవుతుంది. ఖుషి చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీతో పాటు యూట్యూబ్‍లో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం