OTT: ఓటీటీల్లో ఈ వారం టాప్-7 రిలీజ్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. క్రికెట్ సిరీస్ కూడా…-ott top 7 releases this week game changer kobali baby john and more netflix amazon prime video hotstar streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీల్లో ఈ వారం టాప్-7 రిలీజ్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. క్రికెట్ సిరీస్ కూడా…

OTT: ఓటీటీల్లో ఈ వారం టాప్-7 రిలీజ్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. క్రికెట్ సిరీస్ కూడా…

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2025 05:04 PM IST

OTT Top Releases: ఈ వారం ఓటీటీల్లో మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు క్యూ కడుతున్నాయి. ఇందులో ఏడు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ ఈవారమే అడుగుపెట్టనుంది. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఓ సిరీస్ వచ్చేయనుంది.

OTT Top Releases: ఓటీటీల్లో ఈ వారం 7 ముఖ్యమైన రిలీజ్‍లు.. విభిన్నమైన జానర్లలో.. క్రికెట్ ఫ్యాన్స్‌కు కూడా ట్రీట్
OTT Top Releases: ఓటీటీల్లో ఈ వారం 7 ముఖ్యమైన రిలీజ్‍లు.. విభిన్నమైన జానర్లలో.. క్రికెట్ ఫ్యాన్స్‌కు కూడా ట్రీట్

ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో నయా సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. విభిన్న జానర్లలో కంటెంట్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇందులో ఏడు రిలీజ్‍లపై ఎక్కువ ఆసక్తి ఉంది. వివిధ జానర్లలో ఇవి ఉన్నాయి. రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ఇదే వారం అడుగుపెట్టనుంది. భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరంపై రూపొందిన ఓ సిరీస్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న 7 ముఖ్యమైన రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

గేమ్ ఛేంజర్

గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ పొటిలికల్ యాక్షన్ మూవీ నెలలోగానే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడలో ప్రైమ్ వీడియోలో మరో రెండు రోజుల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. గేమ్ ఛేంజర్ మూవీకి శంకర్ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్

‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా vs పాకిస్థాన్’ డాక్యమెంటరీ సిరీస్ ఫిబ్రవరి 7న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరంపై ఈ సిరీస్ రూపొందింది. ఇరు జట్ల మధ్య గతంలో జరిగిన కీలక మ్యాచ్‍లు, ముఖ్యమైన ఘట్టాలు, దిగ్గజ ఆటగాళ్ల అభిప్రాయాలు, ఉత్కంఠభరిత క్షణాలు ఈ సిరీస్‍లో ఉంటాయి. క్రికెట్ అభిమానులకు ఈ సిరీస్ ఓ ఫీస్ట్‌లా ఉండనుంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో 7వ తేదీ నుంచి ది గేటెస్ట్ రైవల్రీ చూడొచ్చు.

మిసెస్

మిసెస్ చిత్రం ఫిబ్రవరి 7న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. మలయాళ పాపులర్ మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కు హిందీ రీమేక్‍గా ఈ మూవీ రూపొందింది. మిసెస్ చిత్రంలో సాన్య మల్హోత్రా, నిషాంత్ దహియా ప్రధాన పాత్రలు పోషించగా.. ఆర్తి కడవ్ దర్శకత్వం వహించారు.

వివేకానందన్ వైరల్

వివేకానందన్ వైరల్ మూవీ ఫిబ్రవరి 7వ తేదీ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. గతేడాది థియేటర్లలో రిలీజైన మలయాళ కామెడీ డ్రామా మూవీ వివేకానందన్ వైరలను చిత్రానికి తెలుగు డబ్బింగ్‍ వెర్షన్‍‍‍గా వస్తోంది. వివేకానందన్ వైరల్ చిత్రంలో షైన్ టామ్ చాకో, స్వస్తిక గ్రేమ్ ఆంటోనీ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీని తెలుగులో ఫిబ్రవరి 7 నుంచి ఆహాలో వీక్షించుచొచ్చు.

కోబలి

తెలుగు రివేంజ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘కోబలి’ ఇప్పటికే ఈ మంగళవారం (ఫిబ్రవరి 7) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన ఈ సిరీస్‍లో రవిప్రకాశ్ ప్రధాన పాత్ర పోషించగా.. రేవంత్ లెవక దర్శకత్వం వహించారు.

ది మెహతా బాయ్స్

ఎమోషనల్ డ్రామా మూవీ ‘ది మెహతా బాయ్స్’ ఫిబ్రవరి 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, అవినాశ్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి బొమన్ ఇరానీనే దర్శకత్వం వహించారు. తండ్రీకొడుకుల మధ్య ఈ సినిమా సాగుతుంది.

బేబీ జాన్

వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన బేబీ జాన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, రెంటల్ విధానంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. గత డిసెంబర్ 25వ తేదీన ఈ యాక్షన్ డ్రామా మూవీ థియేటర్లలో విడుదలైంది. కీర్తి సురేశ్ ఈ చిత్రంతోనే బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ మూవీ తేరికి హిందీ రీమేక్‍గా బేబీ జాన్‍ను డైెరెక్టర్ కలీస్ తెరకెక్కించారు.

Whats_app_banner

సంబంధిత కథనం