OTT April Top 5 Releases: ఓటీటీల్లో ఏప్రిల్‍లో టాప్-5 తెలుగు రిలీజ్‍లు.. ఓ సూపర్ హిట్ మూవీ.. మరో డిజాస్టర్-ott top 5 telugu releases in april court movie will be streaming dilruba latest films netflix aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott April Top 5 Releases: ఓటీటీల్లో ఏప్రిల్‍లో టాప్-5 తెలుగు రిలీజ్‍లు.. ఓ సూపర్ హిట్ మూవీ.. మరో డిజాస్టర్

OTT April Top 5 Releases: ఓటీటీల్లో ఏప్రిల్‍లో టాప్-5 తెలుగు రిలీజ్‍లు.. ఓ సూపర్ హిట్ మూవీ.. మరో డిజాస్టర్

OTT April Top 5 Releases: ఏప్రిల్‍లోనూ కొన్ని సినిమాలు, సిరీస్‍లో ఓటీటీల్లోకి వచ్చేయనున్నాయి. ఓ తెలుగు సూపర్ హిట్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి.

OTT April Top 5 Releases: ఓటీటీల్లో ఏప్రిల్‍లో రానున్న టాప్-5 తెలుగు రిలీజ్‍లు.. ఓ సూపర్ హిట్ మూవీ.. మరో డిజాస్టర్..

ఓటీటీ ప్లాట్‍‍ఫామ్‍ల్లో ఏప్రిల్ నెలలో తెలుగులో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఓటీటీలో కంటెంట్ చూడాలనుకునే వారికి అందుబాటులోకి రానున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ హిట్ కొట్టిన కోర్ట్ చిత్రం ఏప్రిల్‍లోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. భారీ ప్లాఫ్ అయిన మరో చిత్రం అందుబాటులోకి రానుంది. ఓ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తోంది. ఏప్రిల్‍లో తెలుగులో టాప్-5 ఇంట్రెస్టింగ్ ఓటీటీ రిలీజ్‍లు ఏవంటే..

కోర్ట్

కోర్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈ లీగల్ డ్రామా సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రామ్‍జగదీశ్ దర్శకత్వం వహించారు. నేచులర్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడంతో ముందు నుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపుంది.

కోర్ట్ చిత్రం రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. రూ10కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా ఐదు రెట్లకు మించి వసూళ్లు రాబట్టింది. కోర్ట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఏప్రిల్‍లోనే ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఏప్రిల్ మూడో వారం లేకపోతే నాలుగో వారం ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

దిల్‍రూబా

కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ హీరోహీయిన్లుగా నటించిన దిల్‍రూబా చిత్రం మార్చి 14న విడుదలైంది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి విశ్వ కరణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్ అయింది. క సూపర్ హిట్ తర్వాత దిల్‍రూబాతో కిరణ్‍కు ప్లాఫ్ ఎదురైంది.

దిల్‍రూబా సినిమా ఏప్రిల్‍లో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా తీసుకుంది. ఏప్రిల్ మూడో వారంలో ఆహాలో దిల్‍రూబా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తేదీ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

హోమ్‍టౌన్

తెలుగు వెబ్ సిరీస్ హౌమ్‍టౌన్ ఏప్రిల్ 4వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‍లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యద్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ పరిస్థితుల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. హౌమ్‍టౌన్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‍ను ఏప్రిల్ 4 నుంచి ఆహాలో చూడొచ్చు.

టెస్ట్

స్టార్ యాక్టర్స్ మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన టెస్ట్ సినిమా ఏప్రిల్ 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజ్ కాకుండానే నేరుగా ఓటీటీలోకి వస్తోంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఓ క్రికెటర్, ఓ సైంటిస్ట్, ఓ గృహిణి చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

పెళ్లి కాని ప్రసాద్

కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ చిత్రం మార్చి 21వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు. ఈ మూవీ కూడా ఏప్రిల్‍లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు వెల్లడి కాలేదు.

రాబిన్‍‍హుడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి. రాబిన్‍హుడ్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ, మ్యాడ్ స్క్వేర్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో లేకపోతే మే తొలివారంలో కానీ ఈ చిత్రాలు ఓటీటీల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం