OTT Release: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. వీకెండ్‍కు ప్లాన్ చేసుకోండి!
OTT Top-5 Release this week: ఈ వారంలోనూ ఓటీటీల్లోకి చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేస్తున్నాయి. అయితే, వీటిలో ముఖ్యమైన 5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.
ఈ వీకెండ్‍లో ఓటీటీల్లో కంటెంట్ చూడాలని భావిస్తున్నారా.. ఈ వారం కూడా వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెడుతున్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన రిలీజ్‍లు ఉన్నాయి. ఎంతో మంది వేచిచూస్తున్న ఓ సినిమా కూడా ఇందులో ఉంది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న వాటిలో ముఖ్యమైన టాప్-5 ఏవో ఇక్కడ తెలుసుకోండి. ఈ వీకెండ్ చూసేందుకు ప్లాన్ చేసుకోండి.

మూడు ఓటీటీల్లో హరోం హర
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమా ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జూలై 15న ఆహా ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఒక్క రోజు గ్యాప్‍లో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి కూడా ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, హరోం హర హిందీ డబ్బింగ్‍లో జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (జూలై 18) స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇలా ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. హరోం హర చిత్రానికి జ్ఞానస్వాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాగా.. మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ వీకెండ్‍లో హరోం హర మూవీని ఓసారి చూసేయవచ్చు.
ఆడుజీవితం
మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆడుజీవితం’ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రేపు (జూలై 19) ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన 113 రోజుల తర్వాత ఈ మలయాళ సర్వైవల్ డ్రామా సినిమా ఓటీటీలో అడుగుపెడుతోంది. మలయాళం, తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం అడుగుపెడుతోంది. మార్చి 28న థియేటర్లలో థియేటర్లలో రిలీజైన ఆడుజీవితం మూవీ దాదాపు రూ.160కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒకవేళ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడకపోతే ఓటీటీలో మాత్రం మిస్ అవకండి.!
జీ5లో బహిష్కరణ
బహిష్కరణ తెలుగు వెబ్ సిరీస్ రేపు (జూలై 19) జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. రస్టిక్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‍లో అంజలి ప్రధాన పాత్ర పోషించారు. వేశ్య క్యారెక్టర్ చేశారు. రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్కీ రోల్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్‍కు ముకేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. ఈ వీకెండ్‍లో తెలుగు సిరీస్ కోసం ప్లాన్ చేస్తుంటే జీ5లో బహిష్కరణ చూడొచ్చు.
రెండు ఓటీటీల్లో మ్యూజిక్‍షాప్ మూర్తి
మ్యూజిక్‍షాప్ మూర్తి తెలుగు సినిమా ఈటీవి విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారమే జూలై 16వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఒక్క రోజు వ్యవధిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ ఎమోషనల్ డ్రామా చిత్రంలో అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. 50 ఏళ్ల వయసులో మూర్తి (అజయ్ ఘోష్) డీజే కావాలనుకోవడం చుట్టూ మ్యూజిక్‍షాప్ మూర్తి చిత్రం సాగుతుంది. ఈ సినిమాకు శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజై ప్రశంసలను పొందింది. ఈ మూవీని మిస్ కాకుండా చేసేయండి.
హాట్‍స్పాట్
తమిళ సినిమా హాట్‍స్పాట్ తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. హాట్‍స్పాట్ తెలుగు వెర్షన్ జూలై 17న ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నాలుగు కథలో ఆంథాలజీ మూవీగా వచ్చింది. హాట్‍స్పాట్ చిత్రంలో గౌరీ కిషన్, ఆదిత్య భాస్కర్, శాండీ, అమ్మూ అభిరామ్, జనని, సుభాష్, కలైయారాసన్, సోఫియా మెయిన్ రోల్స్ చేయగా.. విఘ్నేశ్ కార్తిక్ దర్శకత్వం వహించారు. తమిళంలో మార్చి 29న థియేటర్లలో హాట్‍స్పాట్ చిత్రం రిలీజ్ అయింది. తెలుగులో నేరుగా ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. డిఫరెంట్ మూవీని చూడాలంటే ఈ వీకెండ్‍లో దీన్ని ట్రై చేయవచ్చు.