ఈవారం ఓటీటీల్లో టాప్ 5 రిలీజ్‍లు.. ఓ మలయాళ థ్రిల్లర్ తెలుగులో.. హార్ట్ బీట్ సిరీస్ రెండో సీజన్-ott top 5 releases this may 2025 fourth week malayalam thriller pendulum telugu streaming etv win heart beat jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈవారం ఓటీటీల్లో టాప్ 5 రిలీజ్‍లు.. ఓ మలయాళ థ్రిల్లర్ తెలుగులో.. హార్ట్ బీట్ సిరీస్ రెండో సీజన్

ఈవారం ఓటీటీల్లో టాప్ 5 రిలీజ్‍లు.. ఓ మలయాళ థ్రిల్లర్ తెలుగులో.. హార్ట్ బీట్ సిరీస్ రెండో సీజన్

ఈవారం ఓటీటీల్లో కొత్త తెలుగు చిత్రాల హవా పెద్దగా లేదు. తెలుగు డబ్బింగ్‍లో ఓ మలయాళ చిత్రం రానుంది. ఇతర భాషల సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ వారం టాప్-5 రిలీజ్‍లు ఏవంటే..

ఓటీటీల్లో ఈవారం టాప్ 5 రిలీజ్‍లు

ఈ మే నాలుగో వారంలో ఓటీటీల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే, మరీ క్రేజ్ ఉన్న భారీ సినిమాలు ఏవీ ఈ వారంలో రావడం లేదు. మోస్తరు రేంజ్ చిత్రాలు, సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. వీటిలో ఐదు రిలీజ్‍లు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఓ మలయాళ మూవీ రెండేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవి..

పెండులమ్

పెండులమ్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో ఈ గురువారం మే 22వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. రెజన్ ఎస్ బాబు దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం మలయాళంలో 2023 జూన్‍లో థియేటర్లలో విడుదలైంది. అందుకు రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో ఈటీవీ విన్‍లోకి ఈ చిత్రం వస్తోంది. పెండులమ్ సినిమాలో విజయ్ బాబు, అనుమోల్, రమేశ్ పిషరోడీ లీడ్ రోల్స్ చేశారు.

అభిలాషం

మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీ అభిలాషం.. మే 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. మార్చి 29వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో సైజు కురుప్, తన్వి రామ్, అర్జున్ అశోకన్ లీడ్ రోల్స్ చేయగా.. షంజు జేబా దర్శకత్వం వహించారు.

హార్ట్ బీట్ సీజన్ 2

తమిళ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ ‘హార్ట్ బీట్’కు రెండో సీజన్ ఈవారమే షురూ కానుంది. హార్ట్ బీట్ సీజన్ 2 జియో హాట్‍స్టార్ ఓటీటీలో మే 22వ తేదీన స్ట్రీమింగ్ మొదలుకానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ ఈ ఫేమస్ సిరీస్ రెండో సీజన్ అందుబాటులోకి రానుంది. హార్ట్ బీట్ సిరీస్‍లో దీప బాలు, అనుమోల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‍ను డైరెక్టర్లు దీపక్ సుందర్ రాజన్, అబ్దుల్ కబీజ్ తెరకెక్కించారు.

సుమో

తమిళ స్పోర్ట్స్ కామెడీ సినిమా ‘సుమో’ మే 23వ తేదీన టెంట్‍కొట్ట ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. శివ, ప్రియా ఆనంద్, యషినోరి తషిరో ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి ఎస్‍పీ హోసిమిన్ దర్శకత్వం వహించారు.

నాతిచరామి

నాచితరామి అనే లఘు చిత్రం మే 25వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. కథాసుధలో భాగంగా ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలో తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం