OTT Top 3 Malayalam Movies: ఓటీటీలోకి ఈ వారం రాబోతున్న టాప్ 3 మలయాళం మూవీస్.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే-ott top 3 malayalam movies releasing this week swargam rekhachitram vallyettan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top 3 Malayalam Movies: ఓటీటీలోకి ఈ వారం రాబోతున్న టాప్ 3 మలయాళం మూవీస్.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే

OTT Top 3 Malayalam Movies: ఓటీటీలోకి ఈ వారం రాబోతున్న టాప్ 3 మలయాళం మూవీస్.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే

Hari Prasad S HT Telugu
Feb 03, 2025 03:41 PM IST

OTT Top 3 Malayalam Movies: ఓటీటీలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ హిట్సే కాగా.. అందులో ఒకటి 24 ఏళ్ల కిందట వచ్చిన మమ్ముట్టి బ్లాక్‌బస్టర్ మూవీ 4కే వెర్షన్ కూడా ఉండటం విశేషం.

ఓటీటీలోకి ఈ వారం రాబోతున్న టాప్ 3 మలయాళం మూవీస్.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే
ఓటీటీలోకి ఈ వారం రాబోతున్న టాప్ 3 మలయాళం మూవీస్.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే

OTT Top 3 Malayalam Movies: మలయాళం సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఈ వారం మూడు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాయి. రేఖాచిత్రమ్, స్వర్గం, వాలియెట్టాన్ లాంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ మూవీస్ ఎప్పుడు, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి వస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

yearly horoscope entry point

ఓటీటీ టాప్ 3 మలయాళం రిలీజెస్

ఓటీటీలోకి ప్రతి వారంలాగే ఈ వారం కూడా సూపర్ హిట్ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. సోనీలివ్, మనోరమ మ్యాక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీస్ వస్తున్నాయి. అవేంటో చూడండి.

రేఖాచిత్రమ్ - సోనీలివ్

ఈ ఏడాది జనవరి 9న రిలీజైన మలయాళం మూవీ రేఖాచిత్రమ్. ఆసిఫ్ అలీ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (ఫిబ్రవరి 5) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. జొఫిన్ చాకో సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆసిఫ్ అలీతోపాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్ లాంటి వాళ్లు నటించారు.

ఇదో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఓ గ్యాంబ్లింగ్ స్కామ్ లో దొరికిపోయి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ తిరిగి వచ్చి 40 ఏళ్ల కిందటి హత్య కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కేసును పరిష్కరించడం ద్వారా మరోసారి తనను తాను నిరూపించుకోవాలనుకునే అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఇందులో చూడొచ్చు.

స్వర్గం - మనోరమ మ్యాక్స్

ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి వస్తున్న మరో మలయాళం మూవీ స్వర్గం. ఇదొక ఫ్యామిలీ డ్రామా. రెజిస్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సినిమా ఇది. అజు వర్గీస్, జానీ ఆంటోనీ, అనన్యలాంటి వాళ్లు నటించారు.

జీవితంలో వచ్చే సవాళ్లను ఓ కుటుంబంగా కలిసికట్టుగా ఎలా ఎదుర్కోవాలో చూపిస్తూ సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. కుటుంబ అనుబంధాలను చక్కగా చూపించారు. ప్రేమాభిమానాలే నిజమైన స్వర్గం తప్ప.. అది మరెక్కడో ఉండదు అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ మూవీ చూపించింది.

వాలియెట్టాన్ 4కే వెర్షన్- మనోరమ మ్యాక్స్

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మరో మూవీ వాలియెట్టాన్. ఎప్పుడో 24 కిందట రిలీజై సంచలన విజయం సాధించిన మమ్ముట్టి మూవీ. గతేడాది 4కే వెర్షన్ లో థియేటర్లలో రీరిలీజ్ అయింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) మనోరమ మ్యాక్స్ లోకి ఈ 4కే వెర్షన్ అడుగుపెట్టబోతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం