OTT Malayalam Movies: ఈవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 3 మలయాళం మూవీస్ ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా..
OTT Malayalam Movies: ఓటీటీలోకి ఈవారం కొన్ని మలయాళం మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి. మరి వీటిలో టాప్ 4 ఏవో ఒకసారి చూద్దాం. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న వాటిలో రూ.110 కోట్ల వసూళ్ల బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది.

OTT Malayalam Movies: మలయాళం మూవీ లవర్స్ కోసం ఈ వాలెంటైన్స్ డే వీక్ లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిని సోనీ లివ్, హాట్‌స్టార్, మనోరమ మ్యాక్స్ లలో చూడొచ్చు. ఈవారం రాబోతున్న వాటిలో ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఈ సిరీస్ తోపాటు యాక్షన్ థ్రిల్లర్ సినిమా మార్కోను కూడా తెలుగులో చూడొచ్చు.
ఈవారం ఓటీటీ మలయాళం రిలీజెస్
ఓటీటీలోకి ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 మధ్య మూడు మలయాళం సినిమాలు, ఓ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కోతోపాటు ఓరు కట్టిల్ ఓరు మురి, మనోరాజ్యం అనే సినిమాలు.. లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ అనే వెబ్ సిరీస్ వస్తున్నాయి. మరి దేనిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
మార్కో - సోనీ లివ్
గతేడాది థియేటర్లలో రిలీజై మోస్ట్ వయోలెంట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా నిలిచిన మార్కో మూవీ మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.110 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. ఉన్ని ముకుందన్ నటించిన ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
మనోరాజ్యం - మనోరమ మ్యాక్స్
మనోరాజ్యం మూవీ గతేడాది ఆగస్టులో రిలీజైన సినిమా. ఈ ఫ్యామిలీ డ్రామా ఓ మలయాళీని పెళ్లి చేసుకున్న ఓ మెల్‌బోర్న్ వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతోంది. తన భార్యకు కన్యత్వ పరీక్షలు చేయించే అతని జీవితం పూర్తిగా మలుపు తిరుగుతుంది. అతడు మళ్లీ తన జీవితాన్ని గాడిలో పెట్టుకోగలడా లేదా అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
ఒరి కాట్టిల్ ఒరి మురి - మనోరమ మ్యాక్స్
థియేటర్లలో రిలీజైన సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మూవీ ఒరి కాట్టిల్ ఒరి మురి. మంచి రొమాంటిక్ కామెడీ డ్రామాను ఎంజాయ్ చేయాలనుకుంటే మనోరమ మ్యాక్స్ లో సోమవారం (ఫిబ్రవరి 10) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడొచ్చు.
సంబంధిత కథనం