ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ థ్రిల్లర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో మంచి థ్రిల్ అందిచబోతున్నాయి. ఒకే ఓటీటీలో ఇవి స్ట్రీమింగ్ కానున్నాయి. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ వారం రాబోతున్న ఈ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.
వాస్తవ పరిస్థితులను గుర్తుచేసే సన్నివేశాలు, నిజ జీవితంలో ఇంటర్వ్యూలతో సాగే థ్రిల్లర్ డాక్యుమెంటరి సిరీస్ ‘ట్రూ హంటింగ్’. అతీంద్రియ శక్తులను అనుభవించిన వారి దృక్కోణం నుండి నిజమైన సంఘటనలను తెలియజేస్తుంది. వ్యాట్ డోరియన్, రైస్ అలెగ్జాండర్ ఫిలిప్స్, మకెన్నా పికర్స్‌గిల్ తదితరులు నటించారు. ఇప్పటికే ఇది ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫ్యాషన్ ప్రపంచంలో ఎలా ఉంటుంది? అందంతో పాటు ఎదురయ్యే సమస్యలు ఏంటీ అని చూపించేదే ‘విక్టోరియా బెక్‌హామ్’. లండన్ అటెలియర్‌లోకి ప్రేక్షకులను తీసుకువెళుతూ, స్పైస్ గర్ల్-టర్న్డ్ డిజైనర్ పారిస్ ఫ్యాషన్ వీక్ మధ్యలో తన జీవితం, పని గురించి చెప్తుంది. విక్టోరియా బెక్‌హామ్ కనిపించే ఈ థ్రిల్లర్ అక్టోబర్ 9న రిలీజ్ కానుంది.
18 రోజుల యుద్ధంలో ప్రత్యేక దృక్కోణాల ద్వారా చెప్పిన కథ ‘కురుక్షేత్ర’. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం ఆధారంగా రూపొందించిన యానిమేటెడ్ సిరీస్ ఇది. వినోద్ శర్మ, సాహిల్ వైద్య, సౌమ్య దాన్ తదితరులు నటించారు. అక్టోబర్ 10న ఓటీటీ విడుదల కానుంది.
తనను ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి సీరియల్ కిల్లర్ అని తెలిస్తే ఆ కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది. అలాంటి కథతోనే ‘మై ఫాదర్, ది బీటీకే కిల్లర్’ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఒక వ్యక్తి డబుల్ లైఫ్ గడుపుతుండగా పెరిగిన బీటీకే సీరియల్ కిల్లర్ కుమార్తె తన కథను నిజమైన క్రైమ్ డాక్యుమెంటరీలో వెల్లడిస్తుంది. కెర్రీ రావ్సన్ చెప్తుంది. ఇది అక్టోబర్ 10న నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.
యుఎస్ మెరైన్ కార్ప్స్‌లో చేరిన ఒక యువకుడు కథే ఇది. ఇందులో వచ్చే సస్పెన్స్, ఎమోషన్ కొత్తగా ఉంటాయి. మైల్స్ హీజర్, మాక్స్ పార్కర్, వెరా ఫార్మిగా తదితరులు నటించారు. అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇది ఓ పారా నార్మల్ థ్రిల్లర్. తీవ్రమైన బాధ, కోపం, ప్రతీకారంతో రగిలి పోతున్న ఇద్దరు తల్లులు తమ కూతుళ్లపై రివేంజ్ తీర్చుకోవడానికి ఓ మోసగాడిని తిరిగి బతికిస్తారు. కానీ బాధాకరమైన నిజాలు వెలుగులోకి రావడంతో న్యాయం వారి నుండి జారిపోతుంది. షు క్వీ, సింజే లీ, ఫు మెంగ్-పో తదితరులు నటించారు. అక్టోబర్ 9న ఓటీటీ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం