OTT Thriller Series: ఓటీటీలోకి ముంజ్య డైరెక్టర్ నయా థ్రిల్లర్ సిరీస్.. డేట్ ఇదే.. రహస్య నిధి చుట్టూ..-ott thriller web series the secret of the shiledars release date to streaming on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Series: ఓటీటీలోకి ముంజ్య డైరెక్టర్ నయా థ్రిల్లర్ సిరీస్.. డేట్ ఇదే.. రహస్య నిధి చుట్టూ..

OTT Thriller Series: ఓటీటీలోకి ముంజ్య డైరెక్టర్ నయా థ్రిల్లర్ సిరీస్.. డేట్ ఇదే.. రహస్య నిధి చుట్టూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 15, 2025 02:37 PM IST

OTT Thriller Series: ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ముంజ్య డైరెక్టర్ ఆదిత్య ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే..

OTT Thriller Series: ఓటీటీలోకి వస్తున్న ముంజ్యా డైరెక్టర్ నయా థ్రిల్లర్ సిరీస్.. డేట్ ఇదే.. రహస్య నిధి చుట్టూ..
OTT Thriller Series: ఓటీటీలోకి వస్తున్న ముంజ్యా డైరెక్టర్ నయా థ్రిల్లర్ సిరీస్.. డేట్ ఇదే.. రహస్య నిధి చుట్టూ..

ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. హిస్టారికల్ లింక్‍తో మిస్టరీ థ్రిల్లర్‌గా రానుంది. ‘ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్’ పేరుతో ఈ సిరీస్ రూపొందింది. ముంజ్య సినిమాతో బ్లాక్‍బస్టర్ సాధించిన ఆదిత్య సర్పోర్ట్‌దార్ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. రాజీవ్ ఖండేల్వాల్, సాయి తంహన్‍కర్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. ‘ది సీక్రెట్ ఆఫ్ ది షెల్డర్స్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.

yearly horoscope entry point

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్ వెబ్ సిరీస్ జనవరి 31వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. అన్ని ఎపిసోడ్లు ఒకే రోజు స్ట్రీమింగ్‍కు వస్తాయని హాట్‍స్టార్ తెలిపింది.

ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్ సిరీస్‍ను హిస్టారికల్ బ్యాక్‍డ్రాప్‍లో థ్రిల్లర్ సిరీస్‍గా ఆదిత్య రూపొందించారు. మరాఠా యోధుడు శివాజి మహారాజ్‍కు చెందిన నిధిని సంరక్షించడం చుట్టూ ఈ సిరీస్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సిరీస్‍లో రాజీవ్, సాయితో పాటు గౌరవ్ అమ్లానీ, ఆశిష్ విద్యార్థి కీలకపాత్రలు పోషించారు.

ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్ టీజర్ ఇలా..

ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్ వెబ్ సిరీస్ టీజర్ ఇటీవలే వచ్చింది. షెల్డర్స్ అనే గ్రూప్‍కు చీఫ్‍గా రాజీవ్ ఖండేల్వాల్ నటించారు. నిధిని ఈ టీజర్లో మేకర్స్ రివీల్ చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‍కు చెందిన రహస్య నిధిని రక్షించే సీక్రెట్ ఆర్డర్.. షిల్డర్స్ గ్రూప్‍నకు వస్తుంది. ఆ నిధి వెనుక ఉన్న మిస్టరీ, దాన్ని రక్షించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుందని అర్థమవుతోంది. టీజర్‌తో ఈ సిరీస్‍పై అంచనాలు పెరిగాయి. జనవరి 31న ఈ సిరీస్ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.

ముంజ్య గురించి..

ముంజ్య చిత్రంతో డైరెక్టర్ ఆదిత్య సర్పోర్ట్‌దార్ బాగా పాపులర్ అయ్యారు. గతేడాది జూన్‍లో థియేటర్లలో రిలీజైన ఈ హారర్ కామెడీ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. రూ.30 కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ సుమారు రూ.130కోట్లను కొల్లగొట్టింది. తక్కువ బడ్జెట్‍తో అదిరిపోయే కలెక్షన్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. దెయ్యంగా మారిన ఓ అబ్బాయి పగ తీర్చుకునేందుకు ప్రయత్నించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ముంజ్య మూవీతో దర్శకుడు ఆదిత్య మెప్పించారు. ఇప్పుడు, ఆయన నుంచి వస్తున్న ది సీక్రెట్ ఆఫ్ ది షిల్డర్స్ సిరీస్‍పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ముంజ్య మూవీ కూడా హాట్‍స్టార్ ఓటీటీలోనే అందుబాటులో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం