OTT Thriller Web Series: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న రెండు సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. తెలుగులోనూ..-ott thriller web series 1000 babies and snakes and ladders to stream on disney plus hotstar amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Web Series: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న రెండు సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. తెలుగులోనూ..

OTT Thriller Web Series: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న రెండు సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. తెలుగులోనూ..

Hari Prasad S HT Telugu

OTT Thriller Web Series: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. అందులో ఒకటి తమిళం కాగా.. మరొకటి మలయాళం. అయితే ఈ రెండూ తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషం.

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న రెండు సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. తెలుగులోనూ..

OTT Thriller Web Series: థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ మంచి పండగే అని చెప్పొచ్చు. ఒక్కటి కాదు.. మరికొన్ని గంటల్లో రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిన సిరీస్ లు.. తెలుగులోనూ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లలో స్ట్రీమింగ్ కానున్నాయి.

రాబోయే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

శుక్రవారం (అక్టోబర్ 18) రెండు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. వీటిలో ఒకటి తమిళ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ కాగా.. మరొకటి మలయాళ హారర్ థ్రిల్లర్ సిరీస్ 1000 బేబీస్. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక 1000 బేబీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ రెండు వెబ్ సిరీస్ లు తెలుగులోనూ రానుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా వాటిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్ మంచి థ్రిల్ పంచబోతున్న ఈ సిరీస్ ల గురించి మరింత తెలుసుకోండి.

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఓ తమిళ వెబ్ సిరీస్. ఈ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో తమిళంతోపాటు తెలుగులోనూ శుక్రవారం (అక్టోబర్ 18) నుంచి స్ట్రీమింగ్ కానుంది. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఇది.

వాళ్లు చేసే ఓ అల్లరి పని నలుగురినీ ఎలాంటి ప్రమాదంలోకి నెట్టేస్తుంది? దాన్నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారన్నదే ఈ సిరీస్ కథ. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా సాగడంతో సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి.

1000 బేబీస్ వెబ్ సిరీస్

1000 బేబీస్ ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నీనా గుప్తా, రెహమాన్ నటించిన ఈ సిరీస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది శిశువుల హత్యల చుట్టూ తిరిగే సిరీస్. ఈ సిరీస్ మలయాళం, తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఓ అడవిలో లెక్కకు మించిన ఊయలలతో తొలి పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఈ సిరీస్ పై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ తో ఇది మరో లెవల్ కు వెళ్లింది. మరి ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.

ఈ వెబ్ సిరీస్ లే కాకుండా ఈ వీకెండ్ కూడా ఎప్పటిలాగే ఎన్నో ఇతర మూవీస్, వెబ్ సిరీస్ కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.