OTT Thriller Movie: రెండేళ్ల కిందే షూటింగ్ కంప్లీట్.. నేరుగా ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Thriller Movie: ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. రెండేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. తాజాగా సోమవారం (సెప్టెంబర్ 2) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
OTT Thriller Movie: మరో థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు రితేష్ దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్ కలిసి నటించిన ఈ సినిమా రెండేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ఇప్పటి వరకూ థియేటర్లలో రిలీజ్ కు నోచుకోలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సోమవారం (సెప్టెంబర్ 2) ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
విస్ఫోట్ ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ విస్ఫోట్ వస్తోంది. ఈ మూవీ వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారమే (సెప్టెంబర్ 1) ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేసిన సదరు ఓటీటీ.. ఇవాళ (సెప్టెంబర్ 2) మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. కుకీ గులాటీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
రెండు వేర్వేరు ప్రపంచాల్లోని ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఓ చోట కలిసిన కలిసిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది ఈ విస్ఫోట్ మూవీ స్టోరీ. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్ ఓ పైలట్ గా.. ఫర్దీన్ ఖాన్ ఓ క్యాబ్ డ్రైవర్ గా నటించారు.
"రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌ప్లోజన్ కచ్చితంగా ఉంటుంది. విస్ఫోట్ మూవీ మీ జియో సినిమా ప్రీమియంలో సెప్టెంబర్ 6 నుంచి.." అనే క్యాప్షన్ త ఈ ట్రైలర్ ను పోస్ట్ చేశారు.
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి..
విస్ఫోట్ మూవీ 2012లో వచ్చిన వెనుజువెలయన్ ఫిల్మ్ రాక్, పేపర్స్, సిజర్స్ కు రీమేక్. ఈ సినిమా షూటింగ్ ను 2021లో ప్రారంభించారు. ఏడాది తర్వాత షూటింగ్ పూర్తయింది. అంటే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి రెండేళ్లు అవుతోంది. మొత్తానికి ఇప్పుడు జియో సినిమా ఓటీటీలోకి మూవీ అడుగుపెడుతోంది.
రితేష్ దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్ కలిసి గతంలో హే బేబీ మూవీలో నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఇది. ఫర్దీన్ ఈ మధ్యే హీరామండి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించిన విషయం తెలిసిందే. నిజానికి రెండేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారానే ఫర్దీన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా.. దీనికంటే ముందే హీరామండి వచ్చేసింది.