OTT Thriller Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Thriller Movie: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ బ్లాక్‌బస్టర్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.75 కోట్లకుపైనే వసూలు చేయగా.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రానుంది.
OTT Thriller Movie: ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ మలయాళ మూవీ కిష్కింధ కాండమ్ మరికొన్ని గంటల్లోనే రాబోతోంది. మిస్టరీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
కిష్కింధ కాండమ్ ఓటీటీ రిలీజ్ డేట్
మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ కిష్కింధ కాండమ్ మంగళవారం (నవంబర్ 19) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని కొన్ని రోజులు కిందట అనౌన్స్ చేసిన హాట్‌స్టార్.. అప్పటి నుంచీ ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది.
మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ కిష్కింధ కాండమ్ స్ట్రీమింగ్ కానుంది. ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మలయాళం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో రూపొందగా.. ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసింది.
కిష్కింధ కాండమ్ స్టోరీ ఇదీ
దింజిత్ అయ్యతన్ డైరెక్ట్ చేసిన కిష్కింధ కాండమ్ మూవీలో స్టార్ హీరో ఆసిఫ్ అలీతోపాటు అపర్ణ బాలమురలీ, విజయరాఘవన్ లాంటి వాళ్లు నటించారు. ఈ కిష్కింధ కాండమ్ మూవీ కోతులు ఎక్కువగా ఉండే కల్లేపతి రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగే కథగా చిత్రీకరించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా అజయ్ చంద్రన్ అనే ఫారెస్ట్ ఆఫీసర్, అతని భార్య అపర్ణ, ఆమె తండ్రి పోగొట్టుకున్న ఓ పిస్తోలు చుట్టూ తిరుగుతుంది. ఆ మిస్సయిన గన్ ను కనిపెట్టే క్రమంలో అపర్ణకు ఓ మిస్టరీ గురించి తెలుస్తుంది.
అదేంటి? ఆ తర్వాత ఈ జంట జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది ఈ కిష్కింధ కాండమ్ మూవీలో చూడొచ్చు. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను మంగళవారం (నవంబర్ 19) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.