OTT Friday Releases: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు, మూడు సిరీస్‍లు
Friday OTT Releases: ఈ శుక్రవారం రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీల్లో అడుగుపెట్టనున్నాయి. అందులో ఒకటి బ్లాక్‍బస్టర్ కాగా.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానుంది. మూడు వెబ్ సిరీస్‍లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ వీకెండ్‍లో ఓటీటీల్లో కంటెంట్ చూడాలని అనుకుంటున్నారా.. అయితే వాలెంటైన్స్ డే కూడా ఉన్న ఈ శుక్రవారం ఫిబ్రవరి 14న ఐదు ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. సూపర్ హిట్ అయిన వైలెంట్ మూవీ మార్కో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఓ హిందీ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మూడు వెబ్ సిరీస్‍లు ఇంట్రెస్టింగ్‍గా అనిపిస్తున్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న ఐదు ఆసక్తికరమైన రిలీజ్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
ధూమ్ ధామ్
ధూమ్ ధామ్ చిత్రం మంచి బజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ శుక్రవారం ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఈ క్రైమ్ కామెడీ సినిమాలో ప్రతీక్ గాంధీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి అయిన రోజు రాత్రే అనుకోని ఘటనలు జరగడం చుట్టూ ధూమ్ ధామ్ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి రిషబ్ సేథ్ దర్శకత్వం వహించారు. వాలెంటైన్స్ డే నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ధూమ్ ధామ్ మూవీని చూడొచ్చు.
ప్యార్ టెస్టింగ్
ప్యార్ టెస్టింగ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 14న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో సత్యజీత్ దూబే, ప్రతిభ బోర్తాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరూ లవ్ చేసుకొని పెళ్లికి సిద్ధమవుతారు. అయితే, వివాహానికి ముందే అత్తారింట్లో కొన్నాళ్లు ఉండాలని అమ్మాయి కండీషన్ పెట్టడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ప్యార్ టెస్టింగ్ మూవీని జీ స్టూడియోస్ ప్రొడ్యూజ్ చేసింది.
మార్కో
మలయాళ బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ మార్కో కూడా ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‍కు రానుంది. ఫిబ్రవరి 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ చిత్రం మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సోనీ లివ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 20న మలయాళంలో థియేటర్లలో రిలీజై దుమ్మురేపిన ఈ మూవీ ఆ తర్వాత తెలుగులోనూ రిలీజైంది. ఈ మోస్ట్ వైలెంట్ మార్కో చిత్రం ప్రేమికుల దినోత్సవం రోజున సోనీ లివ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రానికి హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు.
మెలో మూవీ
కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘మెలో మూవీ’ ఫిబ్రవరి 14న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో చాయ్ వూ షిక్, పార్క్ బో యంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. జీవితంలో జరిగిన విషాదాల నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరి మధ్య చిగురించే స్నేహం, ప్రేమతో ఈ సిరీస్ సాగుతుంది. వాలెంటైన్స్ డే రోజు చూసేందుకు మంచి ఆప్షన్‍గా ఈ మెలో మూవీ వెబ్ సిరీస్ ఉంటుంది.
ఐయాం మ్యారీడ్.. బట్
‘ఐయాం మ్యారీడ్.. బట్’ వెబ్ సిరీస్ కూడా ఫిబ్రవరి 14న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామాలో అలైస్ కో, జస్పెర్ లియూ లీడ్ రోల్స్ చేశారు. రిలేషన్ల మధ్య సంఘర్షణలతో ఈ సిరీస్ సాగుతుంది.
'మైఫాల్ట్ లండన్' అనే చిత్రం ఫిబ్రవరి 13న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. రవి మోహన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన కాదలిక్క నైరమిళ్లై చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వారమే ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
సంబంధిత కథనం