OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు వెబ్ సిరీస్.. ఇంటర్‌లో సమ్మరే ఉంటుంది హాలీడేస్ ఉండవంటూ..
OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. యువతను ఆకట్టుకునేలా ఆల్ ఇండియా ర్యాంకర్స్ పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ టీజర్ ను న్యూ ఇయర్ డే సందర్భంగా బుధవారం (జనవరి 1) రిలీజ్ చేశారు. ఈ టీజర్ తెగ నవ్వించేస్తోంది.
OTT Telugu Web Series: ర్యాంకులే లక్ష్యంగా సాగిపోతున్నాయి ఈ కాలం చదువులు. అలాంటి చదువులనే కథాంశంగా ఎంచుకొని ఇప్పటికే హిందీలో ఎన్నో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడో తెలుగు వెబ్ సిరీస్ ఇదే స్టోరీతో రాబోతోంది. ఈ సిరీస్ పేరు ఆల్ ఇండియా ర్యాంకర్స్. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ ఒరిజినల్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ టీజర్ ను బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆల్ ఇండియా ర్యాంకర్స్ టీజర్
ఈటీవీ విన్ ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ కాలం ఇంటర్ చదువులు, ఐఐటీల్లో సీట్లంటూ ర్యాంకుల కోసం కుస్తీ పడే స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. అయితే న్యూ ఇయర్ డే సందర్భంగా లీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ చాలా ఫన్నీగా సాగిపోయింది.
టీజర్ మొదట్లోనే వైవా హర్ష తనదైన స్టైల్లో పంచ్ లు వేస్తూ నవ్విస్తాడు. ముగ్గురు స్టూడెంట్స్ కు క్లాస్ పీకుతూ అతడు కనిపిస్తాడు. మూడు నెలల్లో చదవాల్సిన దానిని మూడు రోజుల్లో చదివేసి టాపర్లయిపోదామనుకుంటున్నారా అని అతడు వాళ్లను అడుగుతాడు. గోడలు దూకకూడదు.. పుస్తకాల్లోకి దూకాలి.. ఆటలు ఆడకూడదు.. ఫార్ములాలతో ఆడుకోవాలి.. ఇంటర్లో సమ్మరే ఉంటుంది తప్ప సమ్మర్ హాలిడేస్ ఉండవు.. అంటూ ఇంటర్ స్టూడెంట్స్ పరిస్థితిని వర్ణించే డైలాగులు ఈ టీజర్లో వినిపిస్తాయి. చివర్లో కమెడియన్ సునీల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంకర్స్ కు స్వాగతం.. మీ అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు అని అతడు చెప్పడంతో టీజర్ ముగుస్తుంది.
ఆల్ ఇండియా ర్యాంకర్స్ గురించి..
ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ కోసం కొన్నాళ్ల కిందట ఈటీవీ విన్ కొత్త నటీనటుల కోసం ఓ క్యాస్టింగ్ కాల్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 19న రోషన్ బర్త్ డే సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది.
ప్రముఖ దర్శకుడు, కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ ఈ సిరీస్ ను సమర్పిస్తున్నాడు. ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ ను జోసెఫ్ క్లింటన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అర్జున్ అనే ఓ యువ నటుడు లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ప్రముఖ తెలుగు నటీనటులు కూడా ఇందులో నటించనున్నట్లు ఆ మధ్య సమాచారం బయటకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఈటీవీ విన్ వెల్లడించలేదు. త్వరలోనే అని మాత్రం తాజా అప్డేట్ లో వెల్లడించింది. జనవరి చివర్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.