OTT Telugu Thriller Movie: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ..
OTT Telugu Thriller Movie: లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ఆగస్ట్ 1న రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. శుక్రవారం (ఆగస్ట్ 30) నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Telugu Thriller Movie: తెలుగులో వచ్చిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ శివమ్ భజే. అశ్విన్ బాబు నటించిన ఈ సినిమా ఆగస్ట్ 1న థియేటర్లలో రిలీజైనా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. గతేడాది హిడింబ మూవీతో సక్సెస్ సాధించినా.. ఈ లేటెస్ట్ సినిమా అతనికి నిరాశనే మిగిల్చింది. దీంతో నెల రోజుల్లోపే శివమ్ భజే మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది.
శివమ్ భజే ఓటీటీ స్ట్రీమింగ్
అశ్విన్ బాబు నటించిన శివమ్ భజే మూవీ శుక్రవారం (ఆగస్ట్ 30) నుంచి ఆహా వీడియో, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అబ్దుల్ అప్సర్ హుస్సేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి ముఖ్యమైన పాత్రలు పోషించారు.
శివమ్ భజే స్ట్రీమింగ్ విషయాన్ని ఈ రెండు ఓటీటీలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. "ధైర్య, భక్తి కలగలిసిన అద్భుతమైన కథను చూడండి. శివమ్ భజే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.
శివమ్ భజే ఎలా ఉందంటే?
శివమ్ భజే ఓ డివోషనల్ థ్రిల్లర్ మూవీ. డివోషనల్ అంశానికి క్రైమ్ థ్రిల్లర్, దేశభక్తి పాయింట్‌ను జోడించి దర్శకుడు అఫ్సర్ శివం భజే కథను రాసుకున్నాడు. దేవుడి అండతో దేశానికి ఎదురైన విపత్తును ఓ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నదే శివం భజే మూవీ కథ.
ఇప్పటివరకు ఎవరూ తెలుగు సినిమాలో టచ్ చేయని యూనిక్ పాయింట్‌తో దర్శకుడు ఈ కథ చెప్పేందుకు ప్రయత్నించాడు డైరెక్టర్. ఈ పాయింట్‌ను కన్వీన్సింగ్‌గా చెప్పేందుకు దర్శకుడు అల్లుకున్న డ్రామా బాగుంది.
చందు పాత్రలో అశ్విన్ బాబు యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. థ్రిల్లర్ సినిమాలకు తగ్గట్లుగా అతడి నటన సాగింది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్భాజ్ ఖాన్ సెటిల్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడు.
దిగంగనా సూర్యవన్షీ పాత్రకు కథలో పెద్దగా ఇంపార్టెన్స్ లేనట్లుగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్‌గా హైపర్ ఆది పంచ్ డైలాగ్స్ కొన్ని నవ్వించాయి. వికాస్ బాడిస తన బీజీఎమ్ తో డివోషనల్ ఫీల్ కలిగించాడు. శివం భజే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే ఆడియెన్స్‌ను ఈ మూవీ కొంత వరకు మెప్పిస్తుంది.