ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు లోబడ్జెట్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా!-ott telugu thriller movie 28 degree celsius movie trending now on amazon prime video naveen chandra film ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు లోబడ్జెట్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా!

ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు లోబడ్జెట్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా!

28 డిగ్రీ సెల్సియస్ చిత్రం ఓటీటీలో సత్తాచాటుంది. థియేట్రికల్ రిలీజ్‍లో పెద్దగా కలెక్షన్లు రాకపోయినా స్ట్రీమింగ్‍లో అదరగొడుతోంది. నేషనల్ వైడ్‍గా ట్రెండింగ్‍లోకి వచ్చేసింది.

ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు లోబడ్జెట్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా!

తెలుగు హీరో నవీన్ చంద్ర హీరోగా నటించిన 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం మార్చి 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో షాలినీ హీరోయిన్‍గా నటించారు. పొలిమేరతో పాపులర్ అయిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు కావటంతో ఈ మూవీకి మంచి బజ్ వచ్చింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో థియేటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కానీ ఓటీటీలో 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం అదరగొడుతోంది.

నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో..

28 డిగ్రీ సెల్సియస్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో నేషనల్ వైడ్‍ ట్రెండింగ్‍లో టాప్-5లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల ట్రెండింగ్ జాబితాలో ఐదో ప్లేస్‍లో ఈ మూవీ నిలిచింది.

ఏప్రిల్ 29న 28 డిగ్రీ సెల్సియస్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. క్రమంగా వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు ఇండియా రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది. లోబడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతోంది.

ఈటీవీ విన్‍లోనూ..

28 డిగ్రీ సెల్సియస్ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. మే 4న ఆ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీల్లో చూసేయవచ్చు. డిఫరెంట్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది.

28 డిగ్రీ సెల్సియస్ మూవీని రొమాంటిక్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ అనిల్ తెరకెక్కించారు. శరీరంలో కచ్చితంగా 28 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాల్సిందేననే ఇంట్రెస్టింగ్ పాయింట్‍ ఉంటుంది. ఈ మూవీ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, షాలినీ సహా ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాశ్, రాజా రవీంద్ర కీలకపాత్రలు పోషించారు.

వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాక్ బ్యానర్లు.. 28 డిగ్రీ సెల్సియస్ చిత్రాన్ని నిర్మించాయి. సుమారు రూ.4కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందిందని తెలుస్తోంది. లోబడ్జెట్‍తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమాకు శరవణ్ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం