OTT Telugu Romantic Comedy Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి
OTT Telugu Romantic Comedy Movie: ఓటీటీలోకి ఎలాంటి సమాచారం లేకుండా వచ్చేసింది ఓ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ. ఈ సినిమా మంగళవారం (ఆగస్ట్ 27) నుంచి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
OTT Telugu Romantic Comedy Movie: ఓటీటీ ప్రేక్షకులను ఇప్పుడో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఎంటర్టైన్ చేయనుంది. ఈ సినిమా పేరు హనీమూన్ ఎక్స్‌ప్రెస్. చైతన్య రావు, హెబ్బా పటేల్ నటించిన ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. జూన్ 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అంతంతమాత్రం రెస్పాన్సే వచ్చింది.
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ మంగళవారం (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కాలం ప్రేమ, పెళ్లి, విడాకులపై తీసిన మూవీ ఇది. సరదాగా అదే సమయంలో సెటైరికల్ గా సాగిపోయే ఈ సినిమాలో కొన్ని ట్విస్టులు, సస్పెన్స్ కూడా ఉండటం విశేషం.
నిజానికి ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ అంతంతమాత్రమే ఉండటమే కాదు రివ్యూలు కూడా నెగటివ్ గానే వచ్చాయి. అయితే ఐఎండీబీలో మాత్రం ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కు ఏకంగా 8.7 రేటింగ్ ఉంది. చైతన్య రావు, హెబ్బా పటేల్ మధ్య రొమాన్స్ పై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కథేంటంటే?
ఓ జంట పెళ్లి చేసుకునేది జీవితాంతం కలిసి ఉండటానికే. విడాకులు అనేది చాలా పెద్ద విషయం. కానీ అది ఒకప్పటి మాట. ఈ కాలంలో చాలా చిన్న చిన్న విషయాలకు విడాకుల వరకూ వెళ్లిపోతున్నారు. ఈ అంశాన్నే తీసుకొని సెటైరికల్ రొమాంటిక్ కామెడీగా ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీని తెరకెక్కించారు.
తొలి చూపులోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంట మధ్య తర్వాత ఎలాంటి మనస్ఫర్ధలు వస్తాయి? తమ శృంగార జీవితాన్నీ ఆస్వాదించలేని పరిస్థితుల్లో వీళ్లకు ఓ వృద్ధ జంట (సుహాసిని, తనికెళ్ల భరణి) కలిసి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ రిసార్టుకు వెళ్లాల్సిందిగా సూచిస్తారు. అక్కడ ఈ ఇద్దరి మధ్య మరోసారి ప్రేమ చిగురించేలా చేసి కలిసి ఉండేలా చేయడం అనేది వాళ్ల ప్లాన్.
అక్కడికి వెళ్లిన తర్వాత ఈ జంట ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుంది? చివరికి వీళ్లు కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారా లేదా అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాను బాల రాజశేఖరుడు డైరెక్ట్ చేశాడు. ఈ పాయింట్ కొత్తగా ఉన్నా.. దానిని అతడు ప్రజెంట్ చేసిన విధానం బెడిసికొట్టడంతో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
అక్కడక్కడా కొన్ని ట్విస్టులు బాగానే అనిపించినా.. చివరికి ఏమవుతుందో ముందే తెలిసిపోవడం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. ఈ సినిమాలో ఈషాన్ అనే పాత్రలో చైతన్య రావు నటించాడు. ఇక హెబ్బా పటేల్ పాత్రను అందాల ఆరబోత కోసమే ఎక్కువగా వాడుకున్నట్లు కరిపిస్తోంది. మరి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీలో ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.