OTT Suspense: ఓటీటీలో ఎవర్ గ్రీన్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్- అప్పట్లోనే అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్- 7.6 రేటింగ్!
OTT Telugu Suspense Crime Thriller Movie: ఓటీటీలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఎవర్ గ్రీన్ తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అవే కళ్లు స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ, కాంచన నటించిన ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అవే కళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
OTT Telugu Suspense Crime Thriller Movie: ఓటీటీలో ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్‌కు సూపర్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఒకానొక సమయంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అదరగొట్టాయి.
అదిరిపోయే క్లైమాక్స్
ఈ ఓటీటీల కాలం లేనప్పుడే థియేటర్లలో డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ చవిచూశారు తెలుగు ఆడియెన్స్. ఊహించని మలుపులతో, అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్‌తో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగులో వచ్చింది. అందులో ప్రయోగాలకు పెట్టింది పేరు అయిన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించారు.
ఆ సినిమా మరేదో కాదు అవే కళ్లు. ఈ మూవీ టైటిల్ చెబితే ఎక్కువమందికి గుర్తు రాకపోవచ్చు. కానీ, "మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది.. ఆ ఊళ్లో ఒక చిన్నోడు.. నేనున్నాలే పదమన్నాడు.." అనే పాట మాత్రం ఎవరు మరిచిపోరు. ముఖ్యంగా 80, 90 కాలంలోని ఆడియెన్స్‌లో ఈ పాట అన్నా, అవే కళ్లు సినిమా అన్న స్పెషల్ క్రేజ్ ఉంటుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
1967లో తెలుగు, తమిళంలో ఏక కాలంలో తెరకెక్కించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అవే కళ్లు. ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరు ఊహించనివిధంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు అవే కళ్లు ఒక ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా అవే కళ్లు సినిమా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.6 రేటింగ్ సాధించుకుంది.
ఇంతటి క్రేజ్ ఉన్న అవే కళ్లు ఓటీటీలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో అవే కళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అమెజాన్ ప్రైమ్‌లో అవే కళ్లు మూవీని తెలుగులో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇదిలా ఉంటే, అవే కళ్లు సినిమాలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ చేస్తే హీరోయిన్‌గా కాంచన నటించారు.
అర్జున్ రెడ్డిలో బామ్మగా
కాంచన మరెవరో కాదు.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు బామ్మగా నటించిన ఆవిడే సీనియర్ హీరోయిన్ కాంచన. ఇక అవే కళ్లు మూవీలో వీరితోపాటు గుమ్మడి, రాజనాల, కమెడియన్ పద్మనాభం, గీతాంజలి కుర్హడే, రమణ రెడ్డి, నాగభూషణం ఇతర కీలక పాత్రలు పోషించారు.
మర్డర్ మిస్టరీ, హారర్, క్రైమ్, సస్పెన్స్, కామెడీ వంటి ఎలిమెంట్స్‌తో అవే కళ్లు మూవీని త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు. కథ అందించిన త్రిలోక్ చందర్ తెలుగు, తమిళ భాషలో తెరకెక్కించారు. ఈ రెండు వెర్షన్స్‌లలో హీరోయిన్‌గా కాంచననే నటించారు. అవే కళ్లులో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తే.. (అథే కన్గల్ తమిళం)లో రవిచంద్రన్ హీరోగా చేశారు.
అవే కళ్లు కథ
అవే కళ్లు సినిమా కథ విషయానికొస్తే.. ఓ ఇంట్లోని కుటుంబంలో ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వారిని ఓ దెయ్యం చంపుతుందని అంతా భావిస్తుంటారు. కానీ, ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి చంపుతున్నాడని హీరో కనుక్కుంటాడు. ఆ మాస్క్ వ్యక్తి ఎవరు? వారిని ఎందుకు చంపుతున్నాడు? అసలు ఎలా చంపగలుగుతున్నాడు? ఆ కుటుంబానికి అతనికి ఉన్న సంబంధం ఏంటీ? అనేదే అవే కళ్లు కథ.
సంబంధిత కథనం