OTT September Telugu Movies: సెప్టెంబర్‌లో ఓటీటీల్లోకి రానున్న నాలుగు టాప్ తెలుగు సినిమాలు.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో రెండు
OTT September Telugu Movies: వచ్చే నెల ఓటీటీల్లోకి కొన్ని తెలుగు సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వీటిలో నాలుగు చిత్రాలు కీలకంగా ఉన్నాయి. అంచనాలు లేకుండా వచ్చిన సూపర్ హిట్ అయిన రెండు తక్కువ బడ్జెట్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.
ఆగస్టు నెల చివరికి వచ్చేసింది. ఈనెలలో కల్కి 2898 ఏడీ, రాయన్, భారతీయుడు 2, టర్బో సహా చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చాయి. వచ్చే నెల (సెప్టెంబర్)లోనూ మరిన్ని చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. వీటిలో నాలుగు తెలుగు చిత్రాల కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. వీటిలో రెండు థియేటర్లలో నిరాశపరచగా.. మరో రెండు అంచనాలను మించి సూపర్ హిట్ అయ్యాయి. ఈ నాలుగింట్లో రెండు చిత్రాలు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనే రానున్నాయి. సెప్టెంబర్‌లో ఓటీటీల్లోకి రానున్న టాప్-4 తెలుగు చిత్రాలు ఏవంటే..
మిస్టర్ బచ్చన్
ఎన్నో అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. మొదటి నుంచి మిక్స్డ్ టాక్‍తో చతికిలపడింది.
మిస్టర్ బచ్చన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. రూ.33కోట్లకు ఈ మూవీ హక్కులను తీసుకున్నట్టు సమాచారం. సెప్టెంబర్‌లోనే ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. రెండో వారంలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించారు.
ఆయ్
ఆయ్ సినిమా అంచనాలకు మంచి సూపర్ హిట్ అయింది. నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ రూరల్ కామెడీ మూవీ రూ.15కోట్లకు కలెక్షన్లను సాధించింది. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది.పోటీ మధ్య ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్‍గా నటించారు. కసిరెడ్డి రాజ్‍కుమార్, అంకిత్ కొయ్య కూడా మెయిన్ రోల్స్ చేశారు.
ఆయ్ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించగా.. జీఏ2 పిక్చర్స్ పతాకం నిర్మించింది. ఈ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. వచ్చే నెల సెప్టెంబర్ మూడో వారంలో ఆయ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డబుల్ ఇస్మార్ట్
రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ కావటంతో చాలా హైప్ ఏర్పడినా.. ఈ చిత్రం దాన్ని నిలుపుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్ బోల్తా కొట్టింది.
డబుల్ ఇస్మార్ట్ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంది. ఆ ఓటీటీలో సెప్టెంబర్ మూడో వారం లేకపోతే నాలుగో వారం ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉంది. డబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.
కమిటీ కుర్రోళ్ళు
కమిటీ కుర్రోళ్ళు తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చిన మంచి విజయం సాధించింది. మెగాడాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తొలి మూవీతోనే సక్సెస్ సాధించారు. ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైంది. మొదటి నుంచి పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ రూరల్ కామెడీ డ్రామా చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ సహా మరికొందరు లీడ్ రోల్స్ చేశారు.
కమిటీ కుర్రోళ్ళు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని ఇటీవలే సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.