ఒకే రోజు ఓటీటీలోకి రెండు తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి హారర్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ అడ్వెంచర్.. ఈవారం పండగే-ott telugu movies this week horror thriller kishkindhapuri action adventure mirai to stream in zee5 and jiohotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఒకే రోజు ఓటీటీలోకి రెండు తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి హారర్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ అడ్వెంచర్.. ఈవారం పండగే

ఒకే రోజు ఓటీటీలోకి రెండు తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి హారర్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ అడ్వెంచర్.. ఈవారం పండగే

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఈవారం ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు వస్తున్నాయి. గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీస్ ఇవి. ఒకటి హారర్ థ్రిల్లర్ కాగా.. మరొకటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా.

ఒకే రోజు ఓటీటీలోకి రెండు తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. ఒకటి హారర్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ అడ్వెంచర్.. ఈవారం పండగే

ఓటీటీ ప్రేక్షకులకు ఈవారం పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం ఒకే రోజు రెండు తెలుగు బ్లాక్‌బస్టర్లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అందులో ఒకటి హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి కాగా.. మరొకటి తేజ సజ్జా నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్ కావడం విశేషం.

మిరాయ్ ఓటీటీ రిలీజ్ డేట్

తేజ సజ్జా నటించిన మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈవారం ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 10 నుంచి ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది. గత వారమే ఈ విషయాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.141 కోట్లకుపైగా వసూలు చేసిందీ మూవీ. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ మూవీ.. తేజకు వరుసగా రెండో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర్ సక్సెస్ అయినా కూడా నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రానుంది. అయితే హిందీ వెర్షన్ పై అప్డేట్ లేదు.

కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్

ఇక సెప్టెంబర్లోనే థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన మరో హారర్ థ్రిల్లర్ తెలుగు మూవీ కిష్కింధపురి. ఈ సినిమా కూడా శుక్రవారమే (అక్టోబర్ 10) ఓటీటీలోకి అడుగుపెడుతోంది. జీ5 ఓటీటీలో ఈ మూవీ రానుంది. నిజానికి వచ్చే వారం వస్తుందని భావించినా.. ఈవారమే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది.

సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓ చిన్న సినిమాగా రిలీజై ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషమే. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ హారర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం