ఓటీటీలో ఈ వారం తెలుగు భాషలో ది బెస్ట్ 8 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, రొమాంటిక్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ తెలుగు సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
కన్నడలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా లీగల్ థ్రిల్లర్ సినిమా యుద్ధకాండ చాప్టర్ 2. జూన్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో యుద్ధకాండ చాప్టర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.
తెలుగులో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఘటికాచలం. నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో బాల నటుడు నిఖిల్ దేవాదుల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఘటికాచలం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళంలో తొలిసారి రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్. ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. జూన్ 20 నుంచి తెలుగుతో సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
ప్రేమలు హీరో నస్లెన్ నటించిన తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం అలప్పుల జింఖానా సోనీ లివ్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జూన్ 20న మరో ఓటీటీ ఆహాలో అలప్పుళ జింఖానా ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం రెండు ఓటీటీల్లో ఈ సినిమాను తెలుగులో వీక్షించవచ్చు.
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కలియుగమ్ 2064. ఈ మూవీ జూన్ 20 నుంచి సౌత్ సింప్లీ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీగా రూపొందిన సినిమా కే-పాప్: ది డీమన్ హంటర్స్. యాక్షన్ లవర్స్ ఇష్టపడే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 20న తెలుగు భాషలోనూ విడుదలైంది.
తెలుగులో ఫ్యామిలీ ఎమోషనల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఒక బృందావనం. జూన్ 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఒక బృందావనం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు సినిమా ఏవి అలనాటి ముద్దులు. బిగ్ బాస్ అర్జున్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ జూన్ 22 నుంచి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ ఒక్క ఏవి అలనాటి ముద్దులు సినిమా తప్పా మిగతా ఏడు మూవీస్ అన్ని ఒక్క జూన్ 20న ఓటీటీ రిలీజ్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్‌కు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలు వీకెండ్‌కు చూసేందుకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
సంబంధిత కథనం