OTT Telugu Movies: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న మూడు తెలుగు సినిమాలు ఇవే.. ఒకటి రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్
OTT Telugu Movies: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి మలయాళ డబ్బింగ్ మూవీ కాగా.. మరొకటి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం.
OTT Telugu Movies: ఓటీటీలోకి ఈ వారం మధ్యలోనే మూడు తెలుగు సినిమాలు వస్తున్నాయి. గురువారం (సెప్టెంబర్ 26) ఈ మూవీస్ వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో నాని నటించిన సరిపోదా శనివారం కూడా ఒకటి కావడం విశేషం. మరి మిగిలిన ఆ రెండు సినిమాలు ఏవి? ఏయే ఓటీటీల్లో ఇవి స్ట్రీమింగ్ కానున్నాయో చూడండి.
ఓటీటీల్లో రానున్న తెలుగు సినిమాలు
సాధారణంగా ప్రతి వారం వీకెండ్ కు ముందు ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ వారం ఒక రోజు ముందే సినిమాల జాతర మొదలు కానుంది. గురువారం (సెప్టెంబర్ 26) ఒక్క రోజే తెలుగులో మూడు మూవీస్ స్ట్రీమింగ్ కు రానున్నాయి.
సరిపోదా శనివారం - నెట్‌ఫ్లిక్స్
నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై థియేటర్ల కంటే ఎక్కువ రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆర్టీఐ - ఈటీవీ విన్
ఈటీవీ విన్ ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు ఆర్టీఐ. ఇదొక లీగల్ థ్రిల్లర్ మూవీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ (సమాచార హక్కు) చట్టం ఎంత శక్తివంతమైనదో వివరిస్తూ సాగే సినిమా ఇది. గురువారం (సెప్టెంబర్ 26) నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు రెండు రోజుల కిందటే ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది.
చాప్రా మర్డర్ కేస్ - ఆహా వీడియో
ఇక గురువారమే ఆహా వీడియోలోకి ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ కూడా తెలుగులో రానుంది. ఈ సినిమా పేరు చాప్రా మర్డర్ కేస్. థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. ఇప్పటికే ఓటీటీల్లో ఉన్న సూపర్ హిట్ మలయాళ సినిమాల జాబితాలో ఇది కూడా చేరనుంది.
ఇక ఈ వారం ఇప్పటికే వివిధ భాషలకు చెందిన మరో మూడు సినిమాలు కూడా తెలుగులో అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఇందులో ఒకటి హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ కాగా.. మరొకటి బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ముంజ్యా. ఇక మలయాళం కామెడీ సినిమా వాజా కూడా హాట్‌స్టార్ లోనే తెలుగులో సోమవారం (సెప్టెంబర్ 23) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.