OTT Telugu Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరు తెలుగు సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!
OTT Telugu Movies: ఈవారం తెలుగు సినిమాలు ఓటీటీలోకి వరుస పెట్టాయి. ఏకంగా ఆరు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఇందులో లోబడ్జెట్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఏ ఓటీటీల్లోకి.. ఏ తెలుగు సినిమాలు వచ్చాయంటే..
ఈ వీకెండ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో తెలుగు సినిమాలు చూడాలని ప్లాన్ చేసుకున్న వారికి ఈవారం కొత్తగా ఆరు చిత్రాలు వచ్చేశాయి. డిఫరెంట్ జానర్ల చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. శివంభజే చిత్రం సడెన్‍గా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేంది. లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా జానర్ల చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆగస్టు చివరి వారం ఓటీటీల్లోకి వచ్చిన ఆరు సినిమాలు ఏవంటే..
శివంభజే
అశ్విన్ బాబు హీరోగా నటించిన శివంభజే సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఈ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి అబ్దుల్ అప్సర్ హుసేన్ దర్శకత్వం వహించారు. శివంభజే చిత్రం ఈ శుక్రవారం (ఆగస్టు 30) ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’, ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
బడ్డీ
అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా అంచనాలను ఏ మాత్రం నిలుపుకోలేకపోయింది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్, ప్రమోషన్లతో హైప్ పెంచిన ఈ మూవీ రిలీజ్ తర్వాత దాన్ని నిలుపుకోలేకపోయింది. అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను దక్కించుకోలేదు. బడ్డీ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 30) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
పురుషోత్తముడు
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ డ్రామా మూవీకి పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రామ్ భీమన్ తెరకెక్కించారు. రాజ్ సరసన హాసనీ సుధీర్ హీరోయిన్‍గా చేశారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. పురుషోత్తముడు చిత్రం ఈ గురువారమే (ఆగస్టు 29) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
సారంగదరియా
ఫ్యామిలీ డ్రామా సినిమా సారంగదరియా జూలై 12వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. రాజారవీంద్ర, శివచందు, మొయిన్ మహమ్మద్, మోహిత్ ఈ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీకి పద్మారావ్ అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సారంగదరియా మూవీ నేడే (ఆగస్టు 31) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఎంట్రీ ఇచ్చింది.
హనీమూన్ ఎక్స్‌ప్రెస్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం రూపొందింది. బాలా రాజాశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న రిలీజైంది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమాకు అనుకున్న విధంగా వసూళ్లు రాలేదు. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా ఈ మంగళవారం (ఆగస్టు 27) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాల
ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రం జూన్ 21 థియేటర్లలో రిలీజైంది. ఈ రొమాంటిక్ లవ్ మూవీకి శ్రీనాథ్ పులకారం దర్శకత్వం వహించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రం ఈ వారమే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.